అలనాటి హాలీవుడ్ అందాల తార Marilyn Monroe డ్రెస్‌కి డ్యామెజ్.. American Modelని ఆడేసుకుంటున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-06-15T18:19:35+05:30 IST

ఎప్పటికప్పుడూ కొత్త ఫ్యాషన్‌తో ఆకట్టుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బ్యూటీ Kim Kardashian. మోడల్‌గా..

అలనాటి హాలీవుడ్ అందాల తార Marilyn Monroe డ్రెస్‌కి డ్యామెజ్.. American Modelని ఆడేసుకుంటున్న నెటిజన్లు

ఎప్పటికప్పుడూ కొత్త ఫ్యాషన్‌తో ఆకట్టుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బ్యూటీ Kim Kardashian. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఈ బ్యూటీ బిజినెస్‌ వుమెన్‌గా రాణిస్తోంది. అంతేకాకుండా ఇప్పటికీ తన డ్రెస్సింగ్ స్టైల్‌తో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. ఇటీవల జరిగిన మెట్‌ గాలా (Met Gala) అవార్డు ఫంక్షన్‌కి సైతం ఈ బ్యూటీ హాజరైంది. ఆ వేడులకి అలనాటి హాలీవుడ్ అందాల తార మార్లిన్ మన్రో (Marilyn Monroe) డ్రెస్స్‌ని వేసుకొచ్చి అందరినీ కట్టిపడేసింది. 1962లో ఓ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో మార్లిన్ మన్రో ఈ డ్రెస్‌ని మొదటిసారి వేసుకున్నారు. ఆ డ్రెస్‌‌ని వేలంలో గెలుచుకున్న కిమ్ దాదాపు 60 ఏళ్ల తర్వాత 2022లో జరిగిన మెట్‌గాలా వేడుకలో ధరించింది. కాగా.. ఈ డ్రెస్‌ డ్యామెజ్ అయినట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో కిమ్‌ని ట్రోల్ చేస్తూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు.




ఈ డ్రెస్‌కి సంబంధించి కొన్ని పిక్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో.. మార్లిన్ డ్రెస్ కొంచెం డ్యామెజీ అయ్యింది. కొన్ని స్పటికాలు పగిలిపోయాయి. అలాగే.. డ్రెస్ సైతం కొంచెం చిరిగిపోయింది. దీంతో ఎంతోమంది మార్లిన్ ఫ్యాన్స్ ఈ పోస్ట్‌పై రియాక్ట్ అవుతూ వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. ‘కిమ్ అసలు ఈ డ్రెస్ వేసుకుని ఉండాల్సింది కాదు. దాని బదులు అలాంటిదే మరోది తయారు చేసి దాన్ని వేసుకోవాల్సింది. అప్పుడు ఇలాంటి ఐకానిక్ డ్రెస్‌కి ఎలాంటి సమస్య ఉండకపోయేది’ అని కొందరు ట్వీట్ చేశారు. ‘ఇలాంటివి జరిగినప్పుడే.. చారిత్రాత్మకమైన వస్తువులను ఉంచేందుకు ఓ ఇనిస్టిట్యూట్ అవసరమని అనిపిస్తుంటుంది’ మరి కొందరు అభిప్రాయపడ్డారు.















Updated Date - 2022-06-15T18:19:35+05:30 IST