Anasuya పై నెటిజెన్స్ షాకింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2022-06-15T20:00:01+05:30 IST

ఇటు బుల్లితెరపైనా, అటు వెండితెరపైనా టాలెంట్ చూపిస్తూ దూసుకుపోతున్న బ్యూటీ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj). అమ్మడి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. దక్షిణాదిన ఒక్క కన్నడ తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ అనసూయ తన నటనా కౌశలాన్ని ప్రదర్శించింది.

Anasuya పై నెటిజెన్స్ షాకింగ్ కామెంట్స్

ఇటు బుల్లితెరపైనా, అటు వెండితెరపైనా టాలెంట్ చూపిస్తూ దూసుకుపోతున్న బ్యూటీ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj). అమ్మడి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. దక్షిణాదిన ఒక్క కన్నడ తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ అనసూయ తన నటనా కౌశలాన్ని ప్రదర్శించింది. ప్రస్తుతం ఆమె మరిన్ని చిత్రాలకు కమిట్‌మెంట్ ఇచ్చింది. త్వరలోనే ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం షూటింగ్‌లో పాల్గొనబోతోంది. బుల్లితెర, వెండితెరతో పాటు అనసూయకి మరో ముఖ్య వ్యాపకం సోషల్ మీడియా. అక్కడ ఓ రేంజ్ లో ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఆమె.. తరచుగా తనకి సంబంధించిన ఫోటోస్ ను, వీడియోస్ ను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటుంది. ఆ క్రమంలో ఆమె పిక్స్ కు నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చిపడుతుంటాయి. 


గతంలో చాలా సార్లు అనసూయకి నెగెటివ్ కామెంట్స్ చేసే వారితో గొడవ కూడా జరిగింది. తాజాగా అనసూయకి మరోసారి ఆ గోల తప్పలేదు. ఆమె పోస్ట్ చేసిన పిక్స్ ను విమర్శిస్తూ కామెంట్స్ పెట్టారు. ‘నువ్వు ముసలాదానివైపోతున్నావ్, ముఖంలో గ్లో తగ్గింది, మేకప్ సరిగ్గా వేయలేదా? అంటూ కొందరు కామెంట్స్ పెట్టారు. మరికొందరు అందంగా ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నిజానికి అనసూయ ఎప్పుడు ఫోటోస్ షేర్ చేసినా.. వాటిలో తన ఏజ్ కనిపించనీయకుండా జాగ్రత్త పడుతుంది. ప్రస్తుతం ఆమె వయసు 37. అది పెద్ద వయసుకాదు. అయినప్పటికీ.. ఒకోసారి ముఖంలో గ్లో తగ్గినట్టు కనిపిస్తుంది. ఫోటోస్ ఎడిట్ చేయడంలో ఎక్కడో తేడా కొట్టిందని, లేకపోతే.. అనసూయ ఎప్పుడూ అందంగానే కనిపిస్తుందని కొందరు ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ అనసూయ డ్రెస్ సెన్స్ పై విమర్శించేవారు. ఈ సారి ఏకంగా ఆమె అందాన్నే టార్గెట్ చేశారు. మరి ముందు ముందు ఈ వ్యవహారం ఇంకెలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.  



Updated Date - 2022-06-15T20:00:01+05:30 IST