Lalit Modi కాలేజీ కుర్రాడిలా ప్రవర్తిస్తున్నాడంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

ABN , First Publish Date - 2022-07-16T23:43:53+05:30 IST

భూమ్మీద సుఖపడితే తప్పులేదురా.. బులపాటం తీర్చుకుంటే తప్పులేదురా... అని పాత సినిమా పాట ఒకటుంది. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో (Sushmita Sen) డేటింగ్ చేస్తున్నానంటూ ప్రకటించుకున్న

Lalit Modi కాలేజీ కుర్రాడిలా ప్రవర్తిస్తున్నాడంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

భూమ్మీద సుఖపడితే తప్పులేదురా.. బులపాటం తీర్చుకుంటే తప్పులేదురా... అని పాత సినిమా పాట ఒకటుంది. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో (Sushmita Sen) డేటింగ్ చేస్తున్నానంటూ ప్రకటించుకున్న లలిత్ మోదీ(Lalit Modi) వ్యవహారం కూడా ఆ పాటలో లానే బులపాటం తీర్చుకోవడంలా ఉందంటున్నారు ట్రోలర్స్. తాను చేసిన ట్వీట్‌లో సుస్మిత పేరడీ అకౌంట్‌ని ట్యాగ్ చేసినందుకు లలిత్‌ని నెటిజన్స్ ట్రోల్స్‌తో ఆడేసుకుంటున్నారు. 


ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన ఫొటోలను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ పిక్స్‌ను షేర్ చేసే క్రమంలో సుస్మితా ఒరిజినల్ అకౌంట్‌కు బదులు మరో అకౌంట్‌ను ట్యాగ్ చేశాడు. దీంతో నెటిజన్స్ లలిత్ మోదీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ‘‘ఉత్సాహం తట్టుకోలేక మొదటిసారి డేటింగ్ చేసే కాలేజీ కుర్రాడిలా ప్రవర్తిస్తున్నాడు. అతడికీ గర్ల్‌ఫ్రెండ్ ఉందని ప్రతి ఒక్కరికీ చెప్పాలనుకుంటున్నాడు’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘సుస్మితా సేన్‌ అకౌంట్‌కు బదులు మరో అకౌంట్‌కు ట్యాగ్ చేశాడు’’ అని మరో నెటిజన్ స్పందించాడు. ‘‘ఉత్సాహం తట్టుకోలేక వేరే అకౌంట్‌ను ట్యాగ్ చేశాడు’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ స్పందించాడు. ‘‘ఓ సారి తెలుసుకుని ట్వీట్ చేస్తే, అన్ని సార్లు ట్వీట్ చేసే అవసరం లేదుగా’’ అని మరో సోషల్ మీడియా రిప్లై ఇచ్చాడు.



Updated Date - 2022-07-16T23:43:53+05:30 IST