Brahmastra: అనవసరంగా బాయ్‌కాట్ చేశాం.. మళ్లీ విడుదల చేయండి ప్లీజ్.. మూవీ టీంకి ఫ్యాన్స్ రిక్వెస్ట్

ABN , First Publish Date - 2022-11-07T17:51:37+05:30 IST

ఈ ఏడాది బాలీవుడ్‌లో హిట్టైన అతి కొన్ని సినిమాల్లో ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) ఒకటి. ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు...

Brahmastra: అనవసరంగా బాయ్‌కాట్ చేశాం.. మళ్లీ విడుదల చేయండి ప్లీజ్.. మూవీ టీంకి ఫ్యాన్స్ రిక్వెస్ట్

ఈ ఏడాది బాలీవుడ్‌లో హిట్టైన అతి కొన్ని సినిమాల్లో ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) ఒకటి. ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన ఈ చిత్రానికి కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహారించాడు. ఈ మూవీ విడుదల సమయంలో ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ (Boycott Bollywood) బాగా ట్రెండ్ అయ్యింది. అలాగే.. విడుదల తర్వాత ఈ సినిమాకి మిక్స్‌డ్ రివ్యూలు (Review) వచ్చాయి. ఆ ఎఫెక్ట్ ఈ సినిమాపై పడి చాలా మంది మూవీని థియేటర్స్‌లో చూడలేదు. ఈ మూవీ నవంబర్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దాంతో.. ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో చూడలేకపోయిన ఎంతోమంది టీవీల్లో ఎగబడి చూస్తున్నారు. దాంతో.. ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.


అంతేకాకుండా.. ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసిన ఎంతోమందికి ఈ సినిమా చాలా నచ్చేసింది. దాంతో.. ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే.. ఇలాంటి వీఎఫ్‌ఎక్స్ ఉన్న సినిమాని థియేటర్స్‌లో చూడలేకపోయినందుకు బాధపడుతూ పోస్టులు పెడుతున్నారు.


‘వావ్. బ్రహ్మాస్త్ర నిజంగా విజువల్‌గా, కాన్సెప్ట్ పరంగా అద్భుతమైన సినిమా. నేను దానిని థియేటర్‌లలో చూడగలిగితే బాగుండేదని బాధపడుతున్నాను. ఇన్నేళ్ల తర్వాత ఫోన్‌ను తీయకుండా ఇంట్లో కూర్చుని మొదటి సారి పూర్తిగా ఓ సినిమాని చూశాను. పార్ట్ 2 కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. బ్రహ్మాస్త్ర 2 ఎప్పుడు విడుదల అవుతుంది’ అని ఓ నెటిజన్.. ‘ఈ రోజు తెల్లవారుజామున బ్రహ్మాస్త్ర ఫస్ట్ హాఫ్ చూశాను. ఈ రోజు రాత్రికి పూర్తిగా చూస్తాను. ఇది చాలా మంచి చిత్రం,  పురాతన హిందూ సంస్కృతి, వారణాసి, శివ మందిరం మొదలైన వాటి గురించి తెలియజేసింది. ఇంత మంచి సినిమాను బహిష్కరించినందుకు నన్ను క్షమించండి. ఈ సినిమాని థియేటర్స్‌లో మిస్ కాకుండా ఉండాల్సింది. ఇది ఇండియన్ ఎవెంజర్స్’ అని ఇంకో నెటిజన్.. ‘నెగటివ్ రివ్యూల వల్ల థియేటర్స్‌లో చూడని నాలాంటి మూర్ఖుల కోసం బ్రహ్మాస్త్ర మళ్లీ విడుదల చేయండి ప్లీజ్’ అని మరో నెటిజన్ రాసుకొచ్చారు.













Updated Date - 2022-11-07T17:51:37+05:30 IST