Laal Singh Chaddha: సినిమా చూస్తూ నిద్రపోయిన కరీనా కపూర్.. బోరింగ్‌గా ఉందంటూ..

ABN , First Publish Date - 2022-07-24T15:50:27+05:30 IST

దాదాపు నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్ధా’...

Laal Singh Chaddha: సినిమా చూస్తూ నిద్రపోయిన కరీనా కపూర్.. బోరింగ్‌గా ఉందంటూ..

దాదాపు నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ (Aamir khan) నటించిన తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్ధా’ (Laal Singh Chaddha). కరీనా కపూర్ (Kareena Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఆగస్టు 11న విడుదల కానున్న ఈ మూవీ ప్రిమీయర్స్ షోలు రన్ అవుతున్నాయి. ఈ తరుణంలో జరిగిన ఓ షోకి ఆమీర్‌ , ఆయన మాజీ భార్య కిరణ్ రావ్, నటి కరీనా హాజరయ్యారు. దీనికి సంబంధించిన పిక్స్ ట్వీట్‌లో వైరల్ అవుతున్నాయి. 


ఆ పిక్స్‌లో ఆమీర్ మధ్యలో కూర్చొని ఉండగా.. ఆయనకి కుడివైపున కిరణ్ రావ్ కూర్చొని ఉంది. వారిద్దరూ ఎంతో ఆసక్తిగా మూవీని చూస్తుండగా.. ఆమీర్ ఎడమవైపు కూర్చొని ఉన్న కరీనా మాత్రం నిద్రపోతోంది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు నెటిజన్లు వీటిపై స్పిందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘లాల్ సింగ్ చద్ధా చాలా బోరింగ్‌గా ఉన్నట్లు ఉంది అందుకే కరీనా నిద్రపోతోంది’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అలాగే మరికొందరేమో ‘ఫారెస్ట్ గంప్‌ని ఆమీర్ చూడలేదేమో.. అందుకే ఎమోషనల్ అవుతున్నాడు’ అని కామెంట్స్ చేస్తున్నారు.












Updated Date - 2022-07-24T15:50:27+05:30 IST