VIjay Devarakonda: విజయ్‌ ఆ మాటలన్నీ ఏమయ్యాయ్‌!

ABN , First Publish Date - 2022-08-28T00:54:07+05:30 IST

కరోనా లేకుండా ఉంటే థియేటర్స్‌ నింపుతా అంటివి.. సినిమాతో ఇండియా షేక్‌ అవుతుందన్నావు.. అయ్యా తెలీదు లేదు.. తాత తెలీదు అంటివి.. అయినా స్టార్‌గా ఎదిగానంటివి. 200 కోట్ల నుంచి స్టార్ట్‌ చేస్తున్నామని చెప్పుకొచ్చావ్‌.. వాట్‌ లగా దేంగే.. అగ్‌ లగా దేంగే అంటివి.. చూస్తే చూడండి లేదంటే లేదు అని నోరు పారేసుకుంటివి.. ‘లైగర్‌’ రిలీజ్‌ నుంచి నీ గురించే చర్చ...

VIjay Devarakonda: విజయ్‌ ఆ మాటలన్నీ ఏమయ్యాయ్‌!

కరోనా లేకుండా ఉంటే థియేటర్స్‌ నింపుతా అంటివి..

సినిమాతో ఇండియా షేక్‌ అవుతుందన్నావు.. 

అయ్యా తెలీదు లేదు.. తాత తెలీదు అంటివి..

అయినా స్టార్‌గా ఎదిగానంటివి. 

200 కోట్ల నుంచి స్టార్ట్‌ చేస్తున్నామని చెప్పుకొచ్చావ్‌..

వాట్‌ లగా దేంగే.. అగ్‌ లగా దేంగే అంటివి..

చూస్తే చూడండి లేదంటే లేదు అని నోరు పారేసుకుంటివి..

‘లైగర్‌’ రిలీజ్‌ నుంచి నీ గురించే చర్చ... 

పలు వేదికల్లో నువ్వు మాట్లాడిన మాటలపైనే రచ్చ..

ఏమైనదన్నా ఇప్పుడు సైలెంట్‌ అయ్యావు..

ఆ మాటలన్నీ ఇప్పుడు ఏమయ్యాయి...

విజయ్‌ దేవరకొండ (Vijay devarakonda)గురించి నెటిజన్లు మాట్లాడుతున్న మాటలివి. 


ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘లైగర్‌’ (Liger)డిజాస్టర్‌ కావడంతో నెటిజన్లు, అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా విజయ దేవరకొండను, అతని యాటిట్యూడ్‌ను ఆడేసుకుంటున్నారు. పూరి జగన్నాధ్‌ దర్వకత్వం వహించిన ఈ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. ప్రమోషన్స్‌ కోసం ఇండియాలో 15 నగరాల్లో తిరిగారు పూరి టీమ్‌. అయినా ఫలితం లేకపోయింది. మొదటి షోతోనే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పలు వేదికలపై విజయ్‌ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుని అతన్ను టార్గెట్‌ చేస్తున్నారు. ఈ మేరకు పలువురు నెటిజన్లు విజయ్‌ని తిట్టిపోస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు.  (Netizens Fire on vijaydevarakonda)

‘టూ లిటిల్‌’ అంటివి...

‘‘టూ లిటిల్‌ ఆ ఇది’. నార్త్‌లో థియేటర్‌లో జనాలు లేక షోలు క్యాన్సిల్‌ చేస్తున్నారు. ఇప్పుడు సమ్మగా ఉందా.. ఎంత స్టార్‌డమ్‌ ఉన్నా ఒదిగి ఉండడం నేర్చుకో... బలుపు తగ్గించుకో’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 


మరో నెటిజన్‌.. ‘‘ఈ సినిమా పోయినా విజయ్‌ దేవరకొండకు ఇంకో పది సినిమాలు వస్తాయేమో.. ఫైనాన్షియల్‌గా ఈ సినిమా ఫలితం ప్రభావం అతనిపై పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఇంకోసారి పబ్లిక్‌ ప్లేస్‌ లోకి వెళ్ళినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాడు. ఛాతీ మొత్తం కనిపించేలా పనికిమాలిన బట్టలకు కొంచెం దూరంగా ఉంటాడు. మీడియా ముందు కాళ్ల టేబుల్‌ మీదకు వెళ్లవు... అన్నింటి కంటే ముఖ్యం స్ర్కీన్‌పై హీరోయిన్లతో డైరెక్టర్‌ చెప్పినట్టు చేయొచ్చు కానీ నలుగురిలో అమ్మాయి డ్రెస్‌ పట్టుకొని లాగకుండా ఉంటాడు. ఒకే హిట్‌ సినిమా ట్రెండ్‌ను అన్నింటికీ ఫాలో అయితే.. త్వరలోనే రిజెక్ట్‌ చేస్తారని అర్థమవుతుంది’’ అని కామెంట్‌ చేశారు. 




Updated Date - 2022-08-28T00:54:07+05:30 IST