Netizens Fire: రణ్‌బీర్‌ నీకు అసలు బుద్ధి ఉందా!

ABN , First Publish Date - 2022-08-21T00:42:47+05:30 IST

‘రణ్‌బీర్‌ నీకు అసలు బుద్ధి ఉందా’ అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రణబీర్‌ కపూర్‌, ఆలియా, అయాన్‌ ముఖర్జీ ఇన్‌స్టా లైవ్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఓ నెటిజన్‌.. ‘‘పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు ప్రమోషన్స్‌ పూర్తి స్థాయిలో జరగడం లేదు ఎందుకు’’ అని అడిగారు.

Netizens Fire: రణ్‌బీర్‌ నీకు అసలు బుద్ధి ఉందా!

‘రణ్‌బీర్‌(Ranbir kapoor) నీకు అసలు బుద్ధి ఉందా’ అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra)సినిమా ప్రమోషన్‌లో భాగంగా రణబీర్‌ కపూర్‌, ఆలియా, అయాన్‌ ముఖర్జీ ఇన్‌స్టా లైవ్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఓ నెటిజన్‌.. ‘‘పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు ప్రమోషన్స్‌ పూర్తి స్థాయిలో జరగడం లేదు ఎందుకు’’ అని అడిగారు.  అందుకు ఆలియా (alia bhatt) మాట్లాడుతూ ‘‘త్వరలోనే అన్ని ప్రాంతాలకు వెళ్లి సినిమాను ప్రమోట్‌ చేస్తాం. మా సినిమాను భారీగా ప్రమోట్‌ చేయడం లేదు ఎందుకు అని అడుగుతున్నారు. అయితే మా దృష్టంతా’’  అని చెబుతుండగా మధ్యలో రణ్‌బీర్‌ అందుకుని ఆలియా బేబీ బంప్‌ వైపు చూస్తూ.. ‘‘బ్రహ్మాస్త్ర’ను మేం ఎందుకు ప్రమోట్‌ చేయడం లేదంటే ఇక్కడ ఒకరు భారీగా పెరుగుతున్నారు’’ అని అన్నాడు. 


ఆ మాటతో ఆలియా షాకై చిన్నబుచ్చుకున్నట్లు చూసింది. దీంతో రణ్‌బీర్‌.. ‘‘నేను జోక్‌ చేశానంతే’’ అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం నెటిజన్లు ఈ విషయంలో రణబీర్‌పై మండిపడుతున్నారు. ‘రణ్‌బీర్‌ నీకు బుద్థుందా..?’, ‘కడుపులో బిడ్డ ఉన్నప్పుడు కూడా భార్య నీకు బార్బీ బొమ్మలా కనిపించాలా?’, ‘ఆలియా.. నువ్వు రాంగ్‌ స్టెప్‌ వేశావు. నీకు ఇంతమంటే మంచివాడు భర్తగా వచ్చేవాడు. ‘జగ్గా జాసూస్‌’ సమయంలో కూడా రణ్‌బీర్‌.. కత్రినాకైఫ్‌ను ఉద్దేశించి హేళనగా మాట్లాడాడు. ఇప్పుడు ఆలియాభట్‌ ఇబ్బంది పడేలా లైవ్‌లో మాట్లాడుతున్నారు’’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 


రణ్‌బీర్‌ కపూర్‌ – ఆలియాభట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఆయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ధర్మా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 


Updated Date - 2022-08-21T00:42:47+05:30 IST