Krithi Shetty: అయ్యో.. పాపం.. అంటున్నారు!

ABN , First Publish Date - 2022-08-13T21:48:11+05:30 IST

‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మ పాత్రతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయారు కృతీశెట్టి. క్యూట్‌ లుక్స్‌, బ్యూటిఫుల్‌ స్ర్కీన్‌ ప్రెజన్స్‌తో యూత్‌లో కొత్త క్రష్‌గా పేరు తెచ్చుకున్నారు. తొలి చిత్రం సాలిడ్‌ హిట్‌ కావడంతో అవకాశాలు వరుస కట్టాయి. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోందీ ముద్దుగుమ్మ.

Krithi Shetty: అయ్యో.. పాపం.. అంటున్నారు!

‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మ(Bebamma) పాత్రతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయారు కృతీశెట్టి(Krithi Shetty). క్యూట్‌ లుక్స్‌, బ్యూటిఫుల్‌ స్ర్కీన్‌ ప్రెజన్స్‌తో యూత్‌లో కొత్త క్రష్‌గా పేరు తెచ్చుకున్నారు. తొలి చిత్రం సాలిడ్‌ హిట్‌ కావడంతో అవకాశాలు వరుస కట్టాయి. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోందీ ముద్దుగుమ్మ. ‘బంగార్రాజు’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రాల సక్సెస్‌తో కృతి ఉంటే ఆ సినిమా హిట్టే అనేంత గుర్తింపు వచ్చింది. అయితే ఆ తర్వాత ఈ అమ్మడికి కాలం కలిసిరాలేదు. ‘వారియర్‌’తో ఫస్ట్‌ ఫెయిల్యూర్‌ చవిచూసింది. నితిన్‌ సరసన ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ కూడా పరాజయం పాలైంది. నెలన్నర సమయంలో కృతీ ఖాతాలో రెండు ఫ్లాపులు పడ్డాయి. ‘మాచర్ల’ కథ రొటీన్‌ అయినా తెరకెక్కించిన తీరు కూడా ఆకట్టుకునేలా లేదు. హీరోయిన్‌ పాత్ర చిత్రీకరణలోనూ కొత్తదనం లేకపోవడంతో కృతి పాత్ర అంతగా ఆకట్టుకోలేదు. లుక్‌, నటన పరంగా కృతి శెట్టి చేసింది ఏమీ లేదు. క్యారెక్టర్‌ వీక్‌గా ఉన్నప్పుడు యాక్టర్స్‌ తమ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చు. కానీ ఆ రేంజ్‌ యాక్టింగ్‌ టాలెంట్‌ కృతిలో లేనట్లు ఈ చిత్రం నిరూపించింది.  బేబమ్మలాంటి బరువైన పాత్రలో కృతీ ఇరగదీసింది అని ఇప్పటికీ చర్చించుకుంటారు. కానీ ‘వారియర్‌’(warrior), ‘మాచర్ల నియోజకవర్గం(Macherla niyojakavargam)’ చిత్రాల్లో కృతి నటన ఆకట్టుకోలేకపోయింది. కథల పరంగా ఎంతో సెలక్టివ్‌గా ఉంటానంటోన్న ఈ బ్యూటీకి వరుస పరాజయాలు ఎందుకొస్తున్నాయన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. వరుసగా రెండు ఫెయిల్యూర్స్‌ రావడంతో అయ్యో పాపం కృతీ అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ‘ఈ అమ్మాయి గురించి మీకె చెప్పాలి’, వెంకట ప్రభు దర్శకత్వం వహించనున్న బైలింగ్వల్‌ చిత్రాలతో బిజీగా ఉన్నారు కృతీశెట్టి(Krithi Shetty in flops). 

Updated Date - 2022-08-13T21:48:11+05:30 IST