Kaali ని బ్యాన్ చేయాలంటూ డిమాండ్.. ఫిల్మ్ మేకర్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలంటున్న నెటిజన్స్..

ABN , First Publish Date - 2022-07-04T21:37:53+05:30 IST

హిందువుల మనోభవాలను కించపరిచారంటూ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై (Leena Manimekalai)‌కు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు కేసును నమోదు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా చర్యలు

Kaali ని బ్యాన్ చేయాలంటూ డిమాండ్.. ఫిల్మ్ మేకర్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలంటున్న నెటిజన్స్..

హిందువుల మనోభావాలను కించపరిచారంటూ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై (Leena Manimekalai)‌కు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు కేసును నమోదు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కొంతమంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ‘కాళీ’ టైటిల్‌తో లీనా సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్టు ఆ పోస్టర్ ఉంది. వెనుక భాగంలో ఎల్‌జీబీ‌టీ (LGBT) కమ్యూనిటీకి చెందిన జెండా ఉంది. దీంతో ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనేక మంది పోస్ట్‌లు పెడుతున్నారు. సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 


టోరెంటోలోని అగా ఖాన్ మ్యూజియం ‘రిథమ్స్ ఆఫ్ కెనడా’ విభాగంలో ఈ చిత్రం భాగమని ట్విట్టర్‌లో లీనా మణిమేకలై పేర్కొన్నారు. ఆమె ఈ పోస్టర్‌ను విడుదల చేయగానే.. అరెస్ట్‌ లీనా ‌మణిమేకలై (ArrestLeenaManimekal) అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ కావడం మొదలైంది. చాలా మంది నెటిజన్స్ ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్‌ఫాంలో విడుదల చేయడానికి ఎలా అనుమతించారు’’ అని ఓ నెటిజన్  కామెంట్ చేశారు. ‘‘కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్టు చూపించి 100కోట్ల మంది హిందువుల నమ్మకాన్ని మీరు వమ్ము చేశారు’’ అని మరో నెటిజన్ పేర్కొన్నారు. ‘‘మా మతాన్ని కించపరుస్తూ కాళీ మాతను ఎద్దేవా చేశారు’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా అనేక మంది పోస్ట్‌లు పెడుతుండటంతో లీనా స్పందించింది. ‘‘నాకు పోయేదేమి లేదు. నవ్మినా విషయాన్ని బతికి ఉన్నంత వరకూ ధైర్యంగా చెబుతాను. ఒక వేళ ప్రాణాల్ని మూల్యంగా చెల్లించాల్సి వస్తే అందుకు నేను సిద్ధం’’ అని లీనా మేఖలై వెల్లడించింది.

Updated Date - 2022-07-04T21:37:53+05:30 IST