NTR30: అది ఇది కాదు, అదే ఇది!

ABN , First Publish Date - 2022-05-21T02:55:12+05:30 IST

ఎన్టీఆర్ 30 (NTR30) మోషన్ పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక పోస్టర్ గుర్తుకు వచ్చి ఉంటుంది. అదేదో కాదు అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాదే కావడం విశేషం. కొరటాల శివ (Koratala Siva) తన నెక్ట్స్ ప్రాజెక్ట్‪ని బన్నీతో..

NTR30: అది ఇది కాదు, అదే ఇది!

ఎన్టీఆర్ 30 (NTR30) మోషన్ పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక పోస్టర్ గుర్తుకు వచ్చి ఉంటుంది. అదేదో కాదు అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాదే కావడం విశేషం. కొరటాల శివ (Koratala Siva) తన నెక్ట్స్ ప్రాజెక్ట్‪ని బన్నీతో చేయబోతున్నట్లుగా కొన్ని రోజుల క్రితం ఓ వార్త వచ్చింది. ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటనతో పాటు ఒక పోస్టర్ కూడా బయటకి వచ్చింది. సముద్రం పడవలతో డిజైన్ చేసిన ఆ పోస్టర్ చాలా బాగుంటుంది కూడా. సేమ్ ఇప్పుడు కొరటాల ఎన్టీఆర్ (NTR) కలయికలో వస్తున్న మూడో సినిమా ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్‪లో కూడా దాదాపు బన్నీ పోస్టర్‪లో వున్న ఎలిమెంట్సే ఉన్నాయి. 


అంటే కొరటాల ఒకే బ్యాక్ డ్రాప్ వున్న స్టోరీని ఇద్దరు హీరోలకి రాశాడా లేక... ‘ఆచార్య’ (Acharya) రిజల్ట్ తర్వాత తప్పనిసరిగా హిట్ కొట్టాలి కాబట్టి.. అల్లు అర్జున్‪తో అనుకున్న కథతోనే ఎన్టీఆర్‪తో సినిమా చేస్తున్నాడా?. ఈ విషయం తెలియాలంటే.. స్వయంగా కొరటాల శివనే బయటకి వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే అది ఇప్పట్లో జరిగే పని అయితే కాదు. ఈలోపు అల్లు అర్జున్‪తో అనుకున్న సినిమా పోస్టర్, అలాగే ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్‪‪ని ఒక చోట పెట్టి.. ‘అది ఇదే’ అనేలా కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ స్టార్ట్ చేశారు. మరి ఈ కామెంట్స్ ముందు ముందు ఇంకెంత దూరం వెళతాయో వేచి చూద్దాం.





Updated Date - 2022-05-21T02:55:12+05:30 IST