Brahmastra: సినిమాను రివ్యూ చేయకుండా ఉండేందుకే సినీ క్రిటిక్ అరెస్టు

ABN , First Publish Date - 2022-09-09T20:59:11+05:30 IST

బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). బీ టౌన్ క్రేజీ కపుల్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్

Brahmastra: సినిమాను రివ్యూ చేయకుండా ఉండేందుకే సినీ క్రిటిక్ అరెస్టు

బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). బీ టౌన్ క్రేజీ కపుల్  ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించారు. అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్‌‌స్టార్ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల అయింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అయితే, ‘బ్రహ్మాస్త్ర’ ను రివ్యూ చేయకుండా ఉండేందుకే కమల్ ఆర్. ఖాన్‌ను జైలు‌కు పంపించారని నెటిజన్స్ పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో అతడికి మద్దతుగా పోస్ట్‌లు పెడుతున్నారు. 


ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ కమల్. ఆర్. ఖాన్ (కేఆర్‌కే) బీ టౌన్ సెలబ్రిటీలపై తరచు విమర్శలు గుప్పిస్తుంటాడు. దుబాయ్ నుంచి సినిమాలను రివ్యూస్ చేస్తుంటాడు. సోషల్ మీడియాలో అతడికి 5మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్నారు. అయితే, ఇండియాలో సినిమా విడుదల కాకముందే ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ పడతుంటాయి. ప్రీమియర్‌ను చూసి అతడు సోషల్ మీడియా వేదికగా రివ్యూస్ పోస్ట్ చేస్తుంటాడు. దీంతో మూవీ కలెక్షన్స్‌పై ప్రభావం పడుతుందని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ భావించారు. అందువల్ల ఇండియాలో కంటె ముందుగా ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ వేయడం మానేశారు. తన సినిమా ‘బ్రహ్మాస్త్ర’ ను రివ్యూ చేయకుండా ఉండేందుకే కరణ్ జోహార్ అతడిని అరెస్టు చేయించాడని నెటిజన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ విడుదలకు ముందే అతడు అరెస్టు కావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. కేఆర్‌కే 2020లో కొన్ని వివాదస్పద ట్వీట్స్ చేశాడు. ఫలితంగా అతడికి వ్యతిరేకంగా కేసు నమోదు అయింది. తాజాగా కేఆర్‌కే ముంబైకి రావడంతోనే పోలీసులు అరెస్టులు చేశారు. కస్టడీలోకి తీసుకున్నారు. బెయిల్ మీద థానే జైలు నుంచి సెప్టెంబర్ 8న విడుదల చేశారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇండియాలో సినిమా విడుదలకు ముందు ఓవర్సీస్‌లో బాలీవుడ్ మూవీస్ ప్రీమియర్స్ వేయరు. కానీ, ‘బ్రహ్మాస్త్ర’ ప్రీమియర్స్ మాత్రం సెప్టెంబర్ 8న వేయడం చెప్పుకోదగ్గ విశేషం.

Updated Date - 2022-09-09T20:59:11+05:30 IST