నువ్వేం పెద్ద మనిషివంటూ సల్మాన్ ఖాన్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2021-11-03T23:33:21+05:30 IST

బాలీవుడ్ సెలెబ్రిటీలందరూ ప్రతి ఏడాది దీపావళికి భారీ పార్టీలు ఇస్తుంటారు. టిప్స్ ఇండస్ట్రీస్ అధినేత రమేశ్ తౌరానీ ప్రతి ఏడాది లాగానే ఈ సారి కూడా దీపావళికి పార్టీ ఇచ్చారు.

నువ్వేం పెద్ద మనిషివంటూ సల్మాన్ ఖాన్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

బాలీవుడ్ సెలెబ్రిటీలందరూ ప్రతి ఏడాది దీపావళికి భారీ పార్టీలు ఇస్తుంటారు. టిప్స్ ఇండస్ట్రీస్ అధినేత రమేశ్ తౌరానీ ప్రతి ఏడాది లాగానే ఈ సారి కూడా దీపావళికి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బాలీవుడ్‌కు చెందిన అనేక మంది సెలెబ్రిటీలు హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ కూడా ఈ పార్టీకి విచ్చేశారు. పార్టీకి వచ్చిన ఒక మహిళ నుంచి సల్మాన్ ఖాన్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్‌లందరూ కండల వీరుడిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. 


పులకిత్ సామ్రాట్, కృతి కర్భందా, బాబీ దియోల్, ఆయుశ్ శర్మ, ఏక్తా కపూర్ తదితరులందరూ ఈ పార్టీకి వచ్చారు. సల్మాన్ ఖాన్, అతడి రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ లులియా వంతుర్‌లు కూడా పార్టీకి విచ్చేశారు. సల్మాన్ ఖాన్, లులియా వంతుర్ ఒకే సారి పార్టీకొచ్చినప్పటికీ అతడు కారు దిగిన వెంటనే ఆమె కోసం వెయిట్ చేయకుండా లిఫ్ట్ ఎక్కి వెళ్లిపోయాడు. కాసేపట్లోనే ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు బాలీవుడ్ కండల వీరుడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. 


‘‘ ప్రతి ఒక్కరి ముందు ఆమెను ఎందుకు అవమానపరుస్తావు. ప్రతి‌సారి ఎందుకు ఇబ్బంది పడేలా చేస్తావు. ప్రేమ ఉన్న చోటే గౌరవం ఉంటుంది. అతడు నీకు గౌరవం ఇవ్వలేకపోతే ఎప్పుడు నిన్ను లవ్ చేయడు. ఆమెను చూసి నేను చింతిస్తున్నాను  ’’ అని ఒక నెటిజన్ ట్రోల్  చేశారు.  ‘‘ అతడు ఏం పెద్ద మనిషి. ఒక మహిళను తన వెనకాలే వదిలేసి వచ్చాడు ’’ అని మరో నెటిజన్ ఆ వీడియో కింద కామెంట్ చేశారు. ‘‘ సల్మాన్ ఖాన్, అతడి కుటుంబం ఒక మహిళ పక్కన నిలబడటానికి కూడా సిగ్గుపడుతున్నారు ’’  అని ఒక సోషల్ మీడియా యూజర్ తన స్పందనను తెలిపారు.



Updated Date - 2021-11-03T23:33:21+05:30 IST