Madhavan ను ట్రోల్ చేసిన నెటిజన్.. అంతలా ఎందుకు విషం కక్కుతున్నావంటున్న హీరో..

ABN , First Publish Date - 2022-06-30T21:07:00+05:30 IST

స్టార్ హీరో ఆర్. మాధవన్ (R Madhavan) తాజాగా నటించిన సినిమా నటించిన సినిమా ‘రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్’ (Rocketry: The Nambi Effect). నంబి నారాయణ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను

Madhavan ను ట్రోల్ చేసిన నెటిజన్.. అంతలా ఎందుకు విషం కక్కుతున్నావంటున్న హీరో..

స్టార్ హీరో ఆర్. మాధవన్ (R Madhavan) తాజాగా నటించిన సినిమా నటించిన సినిమా ‘రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్’ (Rocketry: The Nambi Effect). నంబి నారాయణ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి మాధవన్ స్వయంగా దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా జులై 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాధవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో నెటిజన్స్ హీరోను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. 


ఇస్రో చేపట్టిన మార్స్ మిషన్‌కు పంచాంగం ఉపయోగపడిందని ఆర్. మాధవన్ తెలిపారు. పంచాంగం చూసి పెట్టిన ముహూర్త బలంతోనే భారత మార్స్ మిషన్ అనేక అడ్డంకులను అధిగమించగలిగిందని చెప్పారు. ఇండియాలో ట్విట్టర్‌ను 25లక్షల మంది వాడుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్‌చల్ చేశాయి. దీంతో కొంత మంది నెటిజన్స్ మాధవన్‌ను తీవ్రంగా ట్రోల్ చేశారు. ‘‘తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి మాధవన్ అదే పనిగా పనికి రాని విషయాలను వాగుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రోజు గడిచే కొద్ది నవ్వు తెప్పించేలా ఉన్నాయి. మరే విధంగా ఆయన సినిమాను ప్రమోట్ చేసుకోలేడా’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ కామెంట్ చేశారు. అందుకు మాధవన్ రిప్లై ఇచ్చారు. ‘‘నువ్వు స్పోర్ట్స్‌మ్యాన్‌వి. అంత కోపం ఎందుకు తెచ్చుకుంటున్నావు. నేను నిద్రలేమితో అలసిపోయాను. ట్విట్టర్‌లో 2.5కోట్ల మంది ఉన్నారు. అందుకు బదులుగా 25లక్షల మంది మాత్రమే అని నేను చెప్పాను. కానీ, దేశ జనాభాలో 1.7శాతం మంది మాత్రమే ట్విట్టర్‌ను వాడుతున్నారు. అదే నా పాయింట్. అంతలా ఎందుకు విషం కక్కుతున్నావు’’ అని మాధవన్ హుందాగా సమాధానమిచ్చారు. ఇస్రో మార్స్ మిషన్‌పై చేసిన వ్యాఖ్యలపై కూడా మాధవన్ స్పందించారు. ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘నాకి శాస్తి జరగాల్సిందే. ఇయర్ బుక్‌ను తప్పుగా తమిళ్‌లో పంచాంగం అని చెప్పాను. నా అజ్ఞానంతో ఆ మాటలను అన్నాను. మార్స్ మిషన్‌ను మనం రెండు ఇంజిన్స్‌తో విజయవంతం చేశాం. నా మాటలు ఈ విజయాన్ని ఏ మాత్రం తక్కువ చేయలేవు. ఆ మిషన్ ఇప్పటికీ రికార్డే’’ అని ఆర్. మాధవన్ పోస్ట్ పెట్టారు.

Updated Date - 2022-06-30T21:07:00+05:30 IST