Nayanthara and Vignesh Shivan: స్టార్ కపుల్‌కు ఊహించని షాక్.. నోటీసులు!

ABN , First Publish Date - 2022-07-20T03:02:59+05:30 IST

స్టార్ కపుల్‌ నయనతార (Nayanthara), విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)లకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఊహించని షాకిచ్చింది. వెంటనే రూ. 25 కోట్లు చెల్లించాలంటూ.. వారికి నోటీసులు పంపినట్లుగా

Nayanthara and Vignesh Shivan: స్టార్ కపుల్‌కు ఊహించని షాక్.. నోటీసులు!

స్టార్ కపుల్‌ నయనతార (Nayanthara), విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)లకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఊహించని షాకిచ్చింది. వెంటనే రూ. 25 కోట్లు చెల్లించాలంటూ వారికి నోటీసులు పంపినట్లుగా తాజా సమాచారం. విషయంలోకి వస్తే.. నయనతార, విఘ్నేశ్ శివన్‌‌లు మహాబలిపురంలోని ప్రముఖ రిసార్ట్‌లో జూన్ 9న వివాహం (Marriage) చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లికి సంబంధించి డిజిటల్ రైట్స్‌ మొత్తం ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) రూ. 25కోట్లకి తీసుకుందని అప్పట్లో రూమర్లు షికార్లు చేశాయి. 


పెళ్లికి సంబంధించిన పూర్తి ఖర్చులను నెట్‌ఫ్లిక్సే చూసుకుందని సమాచారం. ఈ పెళ్లికి విచ్చేసిన అతిథుల కోసం మహాబలిపురం ఫైవ్ స్టార్ హోటల్‌లోని అన్ని గదులను బుక్ చేయడమే కాకుండా.. ఓ గ్లాస్ ప్యాలెస్‌ను కూడా నిర్మించిందని కథనాలు వెలువడ్డాయి. ఒక ప్లేట్ భోజనానికి రూ.3500లను చెల్లించారని తెలుస్తోంది. ఖరీదైన మేకప్ ఆర్టిస్టులు, ముంబై నుంచి వచ్చిన సెక్యూరిటీ గార్డుల కోసం.. ఇలా భారీగానే ఖర్చు చేశారట. స్టైలిష్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఈ పెళ్లికి దర్శకత్వం వహించాడని సమాచారం. ఇంత ఖర్చు పెట్టిన నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. ఈ పెళ్లి వీడియోని ఇప్పటి వరకు టెలికాస్ట్ చేయలేదు. అందుక్కారణం ఈ పెళ్లికి సంబంధించి నయనతారతో కుదుర్చుకున్న డీల్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ క్యాన్సిల్ చేసుకుందని తెలుస్తుంది.


దీనికి కారణం..  నెట్‌ఫ్లిక్స్ సంస్థ రివీల్ చేయకుండానే పెళ్లికి సంబంధించిన ఫొటోలు బయటికి రావడమేనని టాక్.  పెళ్లికి సంబంధించిన ఫొటోలను విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతోనే ఈ డీల్ రద్దు అయినట్టుగా సమాచారం. పెళ్లయిన కొన్ని రోజులకి విఘ్నేశ్ శివన్ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సెలబ్రిటీలు షారూఖ్ ఖాన్, రజినీకాంత్, మణి రత్నం, అట్లీలతో తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ అసంతృప్తి చెందిందని, అందువల్ల డీల్‌ను రద్దు చేసుకోవడమే కాకుండా.. పెళ్లికి ఖర్చు చేసిన రూ. 25 కోట్లను తిరిగిచ్చేయాలని ఈ స్టార్ కపుల్‌కి నోటీసులు పంపిందట. మరి ఈ వ్యవహారంపై నయన్ అండ్ విఘ్నేశ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Updated Date - 2022-07-20T03:02:59+05:30 IST