RRR ను ప్రశంసించిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో Ted Sarandos.. ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2022-07-03T23:25:44+05:30 IST

జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా నటించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించారు. ఈ చిత్రంలో అజయ్

RRR ను ప్రశంసించిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో Ted Sarandos.. ఏమన్నాడంటే..

జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా నటించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ (Ajay Devgan), ఆలియా భట్ (Alia Bhatt), ఒలివియా మోరిస్(Olivia Morris) కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 25న విడుదలైంది. రూ.1100కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో మే 20నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి విదేశీ ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. అనేక మంది సెలబ్రిటీలు ఈ సినిమాను పొగిడారు. తాజాగా నెట్‌ప్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ (Ted Sarandos) ఈ చిత్రాన్ని ప్రశంసించారు. 


‘ఆర్ఆర్‌ఆర్’ సినిమాను పొగుడుతూ టెడ్ సరండోస్ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు. ‘‘నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ను ఇప్పటికి వరకు చూడకపోతే తప్పకుండా వీక్షించండి. ఈ ఏడాది మీరు చూడబోయే అద్భుతమైన సినిమాల్లో ఇది ఒకటి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ హిందీ వెర్షన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. ఈ చిత్రం తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది’’ అని టెడ్ పోస్ట్ పెట్టారు. రోలింగ్ స్టోన్ మ్యాగజైన్ ఈ సినిమా రివ్యూను ప్రచురించింది. ‘‘2022లో వచ్చిన అద్భుతమైన బ్లాక్‌బాస్టర్ ‘ఆర్ఆర్‌ఆర్’. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది’’ అని ఆ మ్యాగజైన్ పేర్కొంది. రోలింగ్ స్టోన్ రివ్యూను కూడా టెడ్ ఫేస్ బుక్ పేజీలో షేర్ చేశాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదలై 100రోజుల పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.



Updated Date - 2022-07-03T23:25:44+05:30 IST