Squid Game: కొరియన్ క్రేజీ వెబ్‌సిరీస్‌ సీజన్ 2 టీజర్ విడుదల.. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-13T15:35:23+05:30 IST

నెట్ వినియోగం పెరిగి ఓటీటీలు ప్రాచుర్యంలోకి రావడం వల్ల.. సినీ లవర్స్‌కి ప్రపంచవ్యాప్తంగా విసృతమైన కంటెంట్ అందుబాటులోకి వచ్చింది...

Squid Game: కొరియన్ క్రేజీ వెబ్‌సిరీస్‌ సీజన్ 2 టీజర్ విడుదల.. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..

నెట్ వినియోగం పెరిగి ఓటీటీలు ప్రాచుర్యంలోకి రావడం వల్ల.. సినీ లవర్స్‌కి ప్రపంచవ్యాప్తంగా విసృతమైన కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో వివిధ దేశాల్లోని ప్రేక్షకులకి ఇతర భాషల సినిమాలు, వెబ్‌సిరీస్‌లను చూడడం అలవాటైంది. ఈ తరుణంలో పలు కొరియన్ వెబ్‌సిరీస్‌లు దేశంలోని పలు భాషల్లో పాపులర్ అయ్యాయి. అందులో.. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘స్క్వీడ్ గేమ్’ అన్నింటినీ మించి అత్యంత ఆదరణ పొందింది.


హ్వాంగ్ డాంగ్ హ్యూక్ అనే కొరియన్ దర్శకుడు దాదాపు 12 ఏళ్లు కష్టపడి ఈ సిరీస్‌‌ని రూపొందించారు. కొరియాలో చిన్న పిల్లలు ఆడే పలు గేమ్‌ల ఆధారంగా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కి పలు దేశాల్లో వీరాభిమానులు ఉన్నారు. దీనికి రెండో సీజన్ రానున్నట్లు మొదటి సీజన్ ఎండింగ్ ఎపిసోడ్‌లో హింట్ సైతం ఇచ్చారు. అప్పటి నుంచి ఆ సీజన్ ఎప్పుడూ వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఓ సందర్భంలో డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘దాదాపు 12 సంవత్సరాలు కష్టపడి ఈ వెబ్‌సీరీస్ తీశాను. విడుదలైన తర్వాత కేవలం 12 రోజుల్లోనే మంచి పాపులారిటీ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు నాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో నాపై ఒత్తిడి పెరిగింది. దీనికి కచ్చితంగా రెండో సీజన్ వస్తుంది. కానీ ఎప్పుడూ వస్తుందో చెప్పలేను’ అని చెప్పుకొచ్చాడు.


ఈ తరుణంలో ఈ సిరీస్ సెకండ్ సీజన్‌కు సంబంధించి టీజర్‌ని నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. కానీ.. ఎప్పుడనేది ప్రసారం అవుతుందనేది మాత్రం ఇంకా ఎనౌన్స్ చేయలేదు. అయినప్పటికీ ఎంతోమంది ఫ్యాన్స్ ‘ఆతృతగా ఎదురుచూస్తున్నాం’, ‘త్వరగా విడుదల చేయండి’ అంటూ ఎంతో ఉత్సాహంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.



Updated Date - 2022-06-13T15:35:23+05:30 IST