Darlings: ఆలియా మూవీ ఓటీటీ రైట్స్‌‌‌కు భారీ ధర చెల్లించిన నెట్‌ఫ్లిక్స్

ABN , First Publish Date - 2022-08-07T21:22:57+05:30 IST

విలక్షణ నటన, వైవిధ్య భరిత సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ ఆలియా భట్ (Alia Bhatt). ‘రాజీ’, ‘కపూర్ అండ్ సన్స్’, ‘గంగూబాయి కతియావాడి’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.

Darlings: ఆలియా మూవీ ఓటీటీ రైట్స్‌‌‌కు భారీ ధర చెల్లించిన నెట్‌ఫ్లిక్స్

విలక్షణ నటన, వైవిధ్య భరిత సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ ఆలియా భట్ (Alia Bhatt). ‘రాజీ’, ‘కపూర్ అండ్ సన్స్’, ‘గంగూబాయి కతియావాడి’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఆలియా నటించిన చిత్రం ‘డార్లింగ్స్’ (Darlings). ఈ సినిమాకు షారూఖ్ ఖాన్‌తో పాటు ఆలియా భట్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాంలోనే విడుదలైంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుందని తెలుస్తోంది.   


ఆలియా నటించిన ‘డార్లింగ్స్’ ఓటీటీ రైట్స్‌కు నెట్‌ఫ్లిక్స్ రూ. 80కోట్లు చెల్లించిందని కథనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమా ఆగస్టు 5 నుంచి డిజిటల్ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు అభిమానుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ‘డార్లింగ్స్’లో విజయ్ వర్మ (Vijay Varma), షెఫాలీ షా, రోషన్ మాథ్యూ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక కథ విషయానికి వస్తే.. బద్రునిసా (ఆలియా భట్)తల్లి మాట ప్రకారమే నడుచుకుంటుంది. హమ్ జా (విజయ్ వర్మ) బద్రుని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అతడికి కోపం ఎక్కువ. మద్యానికి బానిస అయ్యి భార్య మీద చేయి చేసుకుంటుంటాడు. భర్తను మద్యానికి దూరం చేయాలనుకుంటుంది బద్రు. ఆమె ఓ ప్రణాళిక వేస్తే అది అనుకోకుండా భర్తకు తెలుస్తుంది. దీంతో ఇద్దరి మధ్య మరింత దూరం పెరుగుతుంది. ఫలితంగా వీరిద్దరి మధ్య విభేదాలు భగ్గుమంటాయి. భర్త నుంచి శాశ్వతంగా బద్రు ఏ విధంగా విడిపోయిందనేదే మిగతా సినిమా కథ. 



Updated Date - 2022-08-07T21:22:57+05:30 IST