Jawan స్ట్రీమింగ్ రైట్స్‌కు నెట్‌ఫ్లిక్స్ అన్ని కోట్లు చెల్లించిందా..?

ABN , First Publish Date - 2022-07-01T20:58:16+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరోల్లో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఒకరు. చివరగా ‘జీరో’(zero) సినిమాలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీంతో కొంతకాలం సినిమాలకు విరామం

Jawan స్ట్రీమింగ్ రైట్స్‌కు నెట్‌ఫ్లిక్స్ అన్ని కోట్లు చెల్లించిందా..?

బాలీవుడ్ స్టార్ హీరోల్లో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఒకరు. చివరగా ‘జీరో’(zero) సినిమాలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీంతో కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చారు. నాలుగేళ్లుగా వెండితెర మీద కనిపించలేదు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. షారూఖ్ ప్రస్తుతం ‘జవాన్’(Jawan) సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అట్లీ (Atlee) దర్శకత్వం వహిస్తున్నారు. షారూఖ్ సొంత నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్’ నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాగా రూపొందిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 2 మూవీని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌కు ఓటీటీ ప్లాట్‌ఫాం భారీ ధరను చెల్లించిందట. 


‘జవాన్’ స్ట్రీమింగ్ రైట్స్‌కు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్(Netflix) రికార్డ్ ధరను చెల్లించిందట. దాదాపుగా రూ. 120కోట్లను చెల్లించి డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుందని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. షారూఖ్ నుంచి చాలా కాలం తర్వాత సినిమా వస్తుండటంతో డిజిటల్ ప్లాట్‌ఫాం ఇంత ధర చెల్లించిందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ సినిమాపై భారీ బజ్ ఉంది. ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుంటుందో, లేదో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. ‘‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించే సినిమాలను మాములుగా నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేస్తుంటుంది. అందువల్లే ఈ చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్సే దక్కించుకుందని అందరు అనుకుంటున్నారు. ఆ హక్కుల కోసం ఎంత ధర చెల్లించారో ఇప్పుడే చెప్పడం కొంచెం కష్టం. షారూఖ్ ఖాన్, అట్లీ కాంబినేషన్‌పై మంచి బజ్ ఉంది. అందువల్లే ఓటీటీ ప్లాట్‌ఫాం భారీ ధరను చెల్లించిన ఆశ్చర్యపోనావసరం లేదు’’ అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. జవాన్‌లో నయనతార, సాన్యా మల్హోత్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Updated Date - 2022-07-01T20:58:16+05:30 IST