Nenu Meeku Baga Kavalsina Vadini: ఆకట్టుకుంటున్న 'నచ్చావబ్బాయ్' లిరికల్ సాంగ్..

ABN , First Publish Date - 2022-08-14T17:36:20+05:30 IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), సంజన ఆనంద్ (Sanjana Anand) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' (Nenu Meeku Baga Kavalsina Vadini).

Nenu Meeku Baga Kavalsina Vadini: ఆకట్టుకుంటున్న 'నచ్చావబ్బాయ్' లిరికల్ సాంగ్..

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), సంజన ఆనంద్ (Sanjana Anand) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' (Nenu Meeku Baga Kavalsina Vadini). తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజైంది. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ మూవీతో శ్రీధర్ గాదే దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు పాటలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి.


ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన 'నచ్చావబ్బాయ్'.. సాంగ్ యూత్ ఆడియన్స్‌ని అలరిస్తోంది. "నచ్చావబ్బాయ్ పిచ్చి పిచ్చిగా...! పోన్లే అమ్మాయ్ ఇన్నాళ్లకి మంచి మంచి మాటే చెప్పావమ్మాయ్" అంటూ సాగే ఈ సాంగ్ కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ అదిరే మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా, భాస్కర్ భట్ల సాహిత్యం అందించారు. ఇక ఈ సినిమాలో సిధ్ధార్ద్ మీనన్, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్కర్, సమీర్, సంగీత, నిహరిక, ప్రమోదిని ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.


మొదటిసారి కోడి దివ్య నిర్మాతగా రూపొందిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ఇక కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఈ మూవీతో మరో రేంజ్‌కి వెళతాననే నమ్మకంతో ఉన్నాడు. 



Updated Date - 2022-08-14T17:36:20+05:30 IST