Nene Vastunna: వీర సూర ధీర రారా.. ఔరా!

Twitter IconWatsapp IconFacebook Icon
Nene Vastunna: వీర సూర ధీర రారా.. ఔరా!

కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటించిన తాజా చిత్రం ‘నానే వరువెన్’ (Naane Varuven). సెల్వ రాఘవన్ (శ్రీ రాఘవ) (Selva Raghavan) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్ (V Creations) బ్యానర్‌పై  కలైపులి ఎస్ థాను (Kalaipuli S. Thanu) నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘నేనే వస్తున్నా’ (Nene Vastunna) టైటిల్‌తో గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్‌పై అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రతీది.. సినిమాపై భారీగా అంచనాలను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని ‘వీర సూర ధీర రారా’ అనే పాట (Song)ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇంతకు ముందు టీజర్‌లో చెప్పినట్లే.. ‘అడవంతా నీ అధికారం’ అనే లిరిక్ ఈ పాటలో కూడా ఉండటంతో.. అడవిలో జరిగే వేటగా ఈ చిత్రం ఉండబోతుందనేది అర్థమవుతోంది. 


‘‘వీర సూర ధీర రారా

మతి బెదర 

గతి చెదర 

రారా.. రారా..

అడవంతా.. హే హే..

అడవంతా.. నీ అధికారం ఔరా’’ అంటూ సాగిన ఈ పాటకు చంద్రబోస్ (Chandrabose) సాహిత్యం అందించగా.. యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) కంపోజ్ చేశారు. సింగర్ రాహుల్ నంబియార్ (Rahul Nambiar) ఈ పాటని ఆలపించారు. ఈ పాట మొత్తాన్ని అడవిలోనే చిత్రీకరించినట్లుగా కొన్ని మేకింగ్ షాట్స్ కూడా తాజాగా విడుదల చేసిన వీడియోలో చూపించారు. ధనుష్‌ని నటుడిగా తీర్చిదిద్దడంలో అన్నగా సెల్వరాఘవన్ పాత్ర ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే.. ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాలు నటుడిగా ధనుష్ స్థాయిని పెంచడమే కాకుండా.. అతని కెరీర్‌కి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. అందులోనూ గీతా అర్ట్స్ వంటి సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటంతో.. రిలీజ్‌కి ముందు ఎంత క్రేజ్ కావాలో.. అంతా ఈ సినిమాకి వచ్చేసింది. ఇక విడుదల తర్వాత ఎటువంటి రిజల్ట్‌ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 29 వరకు వేచి చూడక తప్పదు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంకా ఈ చిత్రంలో ఎల్లి అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, యోగిబాబు వంటి వారు ఇతర తారాగణంగా నటించారు. 


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.