Bigg Boss 6: నేహా అవుట్‌... ఆసక్తికర సంగతులు!

ABN , First Publish Date - 2022-09-25T05:30:00+05:30 IST

నేహా చౌదరి పరిచయం అక్కర్లేని యాంకర్‌. పలు టీవీ షోలు, సెలబ్రిటీ ఇంటర్వ్యూలో చేయడంలో తనదైన మార్క్‌ సంపాదించుకున్నారు. అలాగే స్పోర్ట్స్‌ యాంకర్‌గా రాణిస్తున్నారు.

Bigg Boss 6: నేహా అవుట్‌... ఆసక్తికర సంగతులు!

నేహా చౌదరి (Neha chowdary)పరిచయం అక్కర్లేని యాంకర్‌. పలు టీవీ షోలు, సెలబ్రిటీ ఇంటర్వ్యూలో చేయడంలో తనదైన మార్క్‌ సంపాదించుకున్నారు. అలాగే స్పోర్ట్స్‌ యాంకర్‌గా రాణిస్తున్నారు. తనకున్న క్రెడిబిలిటీతో ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుంది. మూడోవారం ఎలిమినేషన్స్‌ ద్వారా హౌస్‌ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. తాజా ఎపిసోడ్‌లో ఎలిమినేట్‌ అయినట్లు అక్కినేని నాగార్జున (Nagarjuna)ప్రకటించారు. అప్పటి వరకూ ఇనాయా బయటకొస్తుందనే టాక్‌ నడిచింది. సాయంత్రానికి బిగ్‌బాస్‌ ట్విస్ట్‌ ఇచ్చి నేహాను ఎలిమినేట్‌ చేశారు. అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో ఆమె ఆటతీరుగా అంతగా ఆకట్టుకోలేదని నెటిజన్లు రెండోవారంనుంచి కామెంట్లు మొదలుపెట్టారు. చెప్పిందే చెబుతూ నస పెడుతుంది అంటే నేహాపై ట్రోలింగ్‌ జరిగింది. ఫైనల్‌గా ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చేసింది. (Neha chowdary Eliminated)


నేహా గురించి కొన్ని విషయాలు...

నేహా చౌదరి పుట్టి పెరిగింది ఖమ్మంలోనే. యాంకర్‌గానే కాకుండా జిమ్నాస్టిక్స్‌లో నేషనల్‌ ఛాంపియన్‌. 26 మెడల్స్‌ అందుకొంది. స్టేట్‌ లెవల్‌ స్విమ్మర్‌ కూడా.  కోకో, కబాడీ, జిమ్‌ ట్రైనర్‌, యోగా గురు, మోడల్‌, సివిల్‌ ఇంజనీర్‌, డాన్సర్‌ ఇలా తన మల్టీటాలెంట్‌ అమ్మాయి నేహాచౌదరి. 


హేళన చేశారు...

నాకు వర్క్‌ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో చాలామంది దగ్గరకు వెళ్లి ఏదైనా వర్క్‌ ఉంట చూడమని అడిగాను. వాళ్లంతా.. నీకేంటమ్మా.. నువ్వు చౌదరి అమ్మాయివి కదా.. నీకేం తక్కువ? తల్లిదండ్రులు బాగానే వెనకేసి ఉంటారుగా ఇలాంటి షోలు నీకు అవసరమా? అంటూ హేళన చేసేవారు.  నా పేరు చివర చౌదరి ఉండటం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. నేను నా వర్క్‌కి రెస్పెక్ట్‌ ఇచ్చాను. చిన్న ఛానల్‌లో కెరీర్‌ మొదలుపెట్టి స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌ యాంకర్‌ అయ్యానంటే దాని వెనుక చాలా కష్టం ఉంది. ఎవరి రికమండేషన్‌ నాకు లేదు. కులం నాకు కలిసిరాలేదు. 

కులం పేరుతో మాటలు అన్నారు..

గతంలో ఓ ఛానల్‌లో యాంకర్‌గా చేస్తునప్పుడు మేకప్‌ అవుతుండగా పక్క కుర్చీ ఖాళీగా ఉందని నా బ్యాగ్‌ ఆ కుర్చీలో పెట్టా. ఓ మేల్‌ యాంకర్‌ వచ్చి.. నా బ్యాగ్‌ విసిరి కొట్టాడు. ఎవరు ఇక్కడ బ్యాగ్‌ పెట్టింది.. నేను వస్తే లేచి రెస్పెక్ట్‌  ఇవ్వాలని తెలీదా.. నువ్వు చౌదరి అయితే ఏంటి? ఎవరైతే ఏంటి? నీ కులం ఇక్కడ నడవదు అనగానే నా మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. నేను ఏం తప్పు చేశానని ఇలా తిడుతున్నాడు అన్నది నాకు అర్థం కాలేదు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్‌.. మీ వాళ్ల ఛానల్‌ చూసుకో.. ఇక్కడి నుంచి పో అన్నాడు. నేను ఇక్కడ చాలాకాలంగా చేస్తున్నా... నాకు నేనుగా ఇక్కడికి రాలేదు. షో చేయాలంటే ఛానల్‌ వాళ్లే నన్ను పిలిచారు. నేను ఎంతో కష్టపడి వర్క్‌ చేస్తుంటే మీరేంటి చౌదరి కులం అంటూ మాట్లాడుతున్నారు. నాకు ఆ ఫీలింగ్‌ లేదు’ అని చెప్పినా అతను తగ్గలేదు. కులం పేరుతో మాటలు అంటూనే ఉన్నాడు. ఆ మాటలు వినలేక పెద్దగా ఏడ్చేశాను. తిరగబడి మాట్లాడటానికి అతను నాకు సీనియర్‌. ఏమీ అనలేక సైలెంట్‌ అయిపోయా. అమ్మకి ఆ విషయం చెప్పి బాధపడ్డాను. ఇదంతా 11 ఏళ్ల క్రితం సంగతి’’ అని బిగ్‌బాస్‌కి వెళ్లడానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేహా చెప్పారు. 

Updated Date - 2022-09-25T05:30:00+05:30 IST