ఆ దేశంలో Alia Bhatt, Ranbir Kapoor డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ప్లాన్.. ఫెయిల్ అవ్వడానికి కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-05-09T16:02:42+05:30 IST

బాలీవుడ్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ గత నెలలో పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ముంబైలోని రణ్‌బీర్ ఇల్లు వాస్తులో..

ఆ దేశంలో Alia Bhatt, Ranbir Kapoor డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ప్లాన్.. ఫెయిల్ అవ్వడానికి కారణం ఇదే..

బాలీవుడ్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ గత నెలలో పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ముంబైలోని రణ్‌బీర్ ఇల్లు ‘వాస్తు’లో ఈ జంట కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఒకటయ్యారు. అయితే ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసిందట. ఈ విషయాన్ని రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ (Neetu Kapoor) తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.


నీతూ కపూర్ మాట్లాడుతూ.. ‘రణ్‌బీర్, అలియా జంట 2020లోనే దక్షిణాఫ్రికా (South Africa)లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసింది. అలాగే.. అలియా పన్వెల్ బంగ్లాలో ప్రత్యేక వివాహ కార్యక్రమాలను ప్లాన్ చేశాం. అయితే.. అదే సమయంలో కోవిడ్ రావడంతో వారి ప్రణాళికలకు భంగం కలిగింది. అందుకే దాదాపు రెండేళ్ల తర్వాత ముంబైలో పెళ్లి చేసుకున్నారు.


రణ్‌బీర్, అలియా ఇద్దరికీ తమ పెళ్లి గురించి డిస్కషన్స్ జరగడం ఇష్టం లేదు. అందుకే పెళ్లి 40 మంది అతిథుల మధ్య, వివాహ రిసెప్షన్‌లో 40 మంది స్నేహితుల మధ్య సింపుల్‌గా చేసుకున్నారు. నిజానికి వారి మ్యారేజ్‌ చాలా సింపుల్‌గా, లో ప్రొఫైల్‌లో ఉండేలా చూసుకున్నారు’ అని చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-05-09T16:02:42+05:30 IST