Aryan Khan డ్రగ్స్ కేస్ : ఇద్దరు ఎన్సీబీ అధికారులు Out...

ABN , First Publish Date - 2022-04-14T17:25:40+05:30 IST

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు సంబంధించిన ‘క్రుయిజ్ షిప్ డ్రగ్స్’ కేసు దర్యాప్తు చేస్తోన్న ఇద్దరు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు బుధవారం సస్పెన్షన్‌కి గురయ్యారు. ‘అనుమానాస్పద వ్యవహారాలు’ నడుపుతున్నందకుగానూ వారిపై వేటు పడిందని చెబుతున్నారు. అయితే...

Aryan Khan డ్రగ్స్ కేస్ : ఇద్దరు ఎన్సీబీ అధికారులు Out...

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు సంబంధించిన ‘క్రుయిజ్ షిప్ డ్రగ్స్’ కేసు దర్యాప్తు చేస్తోన్న ఇద్దరు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు బుధవారం సస్పెన్షన్‌కి గురయ్యారు. ‘అనుమానాస్పద వ్యవహారాలు’ నడుపుతున్నందకుగానూ వారిపై వేటు పడిందని చెబుతున్నారు. అయితే, సస్పెండ్ అయిన ఇద్దరు ఆఫీసర్స్ ఏ కేసు కారణంగా శిక్షకి గురయ్యారో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులోనే వారిద్దరూ అనుమానాస్పద చర్యలకు పాల్పడ్డారా అన్న కోణంలో బాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. 

కింగ్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ గత సంవత్సరం గాంధీ జయంతి రోజున డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. ముంబై తీరంలోని ఓ షిప్‌లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఎన్సీబీ దాడులు నిర్వహించింది. ఆర్యన్ సహా పలువుర్ని జైల్లో పెట్టింది. దాదాపు నెల రోజులు ఖైదీగా ఉన్న జూనియర్ ఖాన్ ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ ఇటు బాలీవుడ్‌లోనే కాదు అటు మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రంలోని మోదీ సర్కార్‌కి కూడా మధ్య కూడా కలకలం రేగేలా చేసింది. అయితే, తాజాగా ఈ హై ప్రొఫైల్ నార్కోటిక్స్ కేసులో ఇద్దరు అధికారులు సస్పెండ్ కావటం అనేక అనుమానాలకు తావిస్తోంది.   

Updated Date - 2022-04-14T17:25:40+05:30 IST