NC22: రంగంలోకి దిగిన యంగ్ మాస్ట్రో..

ABN , First Publish Date - 2022-08-24T18:52:37+05:30 IST

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) మొదటిసారి కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ కానుంది.

NC22: రంగంలోకి దిగిన యంగ్ మాస్ట్రో..

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) మొదటిసారి కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ కానుంది. చైతు ఈ ఏడాది ప్రారంభంలో 'బంగార్రాజు' సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత  'థాంక్యూ', 'లాల్ సింగ్ చడ్డా' సినిమాలతో వచ్చి బ్యాక్ టూ బ్యాక్ రెండు ప్లాప్స్ చూశాడు. దీంతో తరువాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ కమిటవుతున్నాడు. 


ఈ క్రమంలోనే 22వ సినిమాగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి ఇద్దరు సంగీత దర్శకులు. వారే మ్యాస్ట్రో ఇళయరాజా (Ilayaraja) ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja). ఇక తాజాగా ఈ సినిమాకు యువన్ మ్యూజిక్ వర్క్ ప్రారంభించారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 'మా యంగ్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా ఎన్‌సి 22 కోసం తన మ్యాజిక్ ప్రారంభించాడు'.. అని వెంకట్ ప్రభు ట్వీట్‌లో పేర్కొన్నారు. 


తెలుగులో తండ్రీకొడుకులు ఇళయరాజా, యువన్ కలిసి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ మూవీపై అందరిలో అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో నాగ చైతన్యకు జంటగా కృతిశెట్టి (Krthi Shetty) నటిస్తుంది. చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు టాక్. చైతు నుంచి అభిమానులు కోరుకునే మాస్, యాక్షన్ అంశాలు జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మరోవైపు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న దూత అనే వెబ్ సిరీస్ రిలీజ్‌కి రెడీ అవుతోంది.  

Updated Date - 2022-08-24T18:52:37+05:30 IST