NBK108: త్వరలో బాంబార్డింగ్..!

ABN , First Publish Date - 2022-08-11T23:56:50+05:30 IST

నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డబుల్ బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) క్రేజీ కాంబినేషన్‌లో NBK108 చిత్రం తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే. డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా

NBK108: త్వరలో బాంబార్డింగ్..!

నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డబుల్ బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) క్రేజీ కాంబినేషన్‌లో NBK108 చిత్రం తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే. డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఈ సినిమా ఏ జానర్‌లో ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు చిత్రయూనిట్ తాజాగా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించబోతున్నారనే అప్‌డేట్‌తో పాటు ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరనేది కూడా తాజా ప్రకటనలో తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. (NBK108 Announcement)


ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ (Shine Screens) బ్యానర్‌పై సాహు గారపాటి (Sahu Garapati), హరీష్ పెద్ది (Harish Peddi) భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. అలాగే ‘అఖండ’ (Akhanda) అద్భుతమైన సక్సెస్‌కు ఓ కారణమైన సంగీత దర్శకుడు ఎస్ థమన్ (S Thaman) ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో బాలకృష్ణ, అనిల్ రావిపూడి , ఎస్ థమన్ కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రం కచ్చితంగా భారీ విజయాన్ని అందుకుంటుందని నిర్మాతలు ప్రకటించారు. ఇక అనౌన్స్‌మెంట్ వీడియోలో.. ‘‘త్వరలో బాంబార్డింగ్…’’ అని తెలిపారు. ఈ వీడియోకి తమన్ ఇచ్చిన బిజీయం మ్యూజిక్ అదిరిపోయింది. అనౌన్స్‌మెంట్  బిజీఎంతోనే అదరగొడితే.. సినిమాలో ఏ స్థాయిలో మ్యూజిక్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోసారి సౌండ్ బాక్స్‌లు బద్దలవ్వాల్సిందే అన్నట్లుగా ముందే తమన్ హింట్ ఇచ్చినట్లుగా ఈ వీడియో ఉంది. మాస్‌ పల్స్‌ తెలిసిన అనిల్‌ రావిపూడి బాలకృష్ణ కోసం విభిన్నమైన, మాస్‌ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారని, బాలయ్యని మునుపెన్నడూచూడని పాత్రలో చూడబోతున్నారని నిర్మాతలు తెలుపుతున్నారు. కాగా, ప్రముఖ తారాగణం నటించనున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారని తెలుస్తుంది.



Updated Date - 2022-08-11T23:56:50+05:30 IST