NBK 108: బాలయ్య సరసన బాలీవుడ్ హీరోయిన్..?

ABN , First Publish Date - 2022-07-29T22:58:37+05:30 IST

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న లేటెస్ట్ మూవీ NBK 107. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం కర్నూల్ లో జరుగుతోంది. ఇందులో శృతి హాసన్ (Shruthi Haasan) హీరోయిన్‌గా నటిస్తోంది.

NBK 108: బాలయ్య సరసన బాలీవుడ్ హీరోయిన్..?

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న లేటెస్ట్ మూవీ NBK 107. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం కర్నూల్ లో జరుగుతోంది. ఇందులో శృతి హాసన్ (Shruthi Haasan) హీరోయిన్‌గా నటిస్తోంది. NBK 107 షూటింగ్ కంప్లీట్ కాకముందే బాలయ్య తన 108 మూవీని ఫైనల్ చేశారు. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య డిఫ్రంట్‌ రోల్‌లో నటిస్తున్నారునే న్యూస్, ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 


బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తోంది. ఇక తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలయ్య సరసన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హాను హీరోయిన్ గా నటింపజేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం సోనాక్షిని ఇప్పటికే సంప్రదించారని, ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ ఇంకా రాలేదని సమాచారం. ఒకవేళ సోనక్షి NBK 108లో నటించడానికి ఓకే చెప్తే మాత్రం... బాలయ్య సినిమా మార్కెట్ అమాంతం పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

Updated Date - 2022-07-29T22:58:37+05:30 IST