నేచురల్ స్టార్ నానీ (Nani) హీరోగా.. ‘మెంటల్ మదిలో’ (Mental Madilo) ఫేమ్ ‘వివేక్ ఆత్రేయ’ (Vivek Athreya) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అంటే సుందరానికీ..’ (Ante Sundaranikee). బ్రాహ్మణ యువకునికి, క్రిస్టియన్ అమ్మాయికి మధ్య ప్రేమ చిగురించడం, కుటుంబ సభ్యులతో గొడవలు జరగడం ఈ సినిమా ప్రధాన కథాంశం. సీన్ సీన్‌కు నవ్వులు పూయించడమే లక్ష్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. బ్రాహ్మణ యువకునిగా, అమాయక చక్రవర్తిగా ఇందులో నానీ సహజ నటనను ప్రదర్శిస్తుండగా.. అతడు ప్రేమించిన అందమైన క్రిస్టియన్ యువతి లీలగా మల్లూ కుట్టి నజ్రియా నజీమ్ (Nazriya Nazim) నటిస్తోంది. ఆమెకిదే తొలి తెలుగు చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను జూన్ 10న విడుదల ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singharoy ) సూపర్ హిట్ తర్వాత నానీ నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలోని తన పాత్రకు నజ్రియా తన ఓన్ వాయిస్‌ను వినిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకు ముందు విడుదలైన ‘అంటే సుందరానికీ..’ ( Ante Sundaranikee ) చిత్రం టీజర్, ట్రైలర్, సింగిల్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మరింత హైపు క్రియేట్ అయింది. నదియా, రాహుల్ రామకృష్ణ, హర్షవర్ధన్, సుధ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. నానీ (Nani) తన కెరీర్ లో ఇది వరకు ఎన్నడూ చేయని విధంగా హిలేరియస్ కామెడీని వర్కవుట్ చేస్తున్నారు. ఇటీవల చిత్ర బృందం ప్రమోషన్స్ ప్రారంభించింది. సినిమా విడుదలకు ఇంకా 16 రోజులుండడంతో మరింతగా ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు మేకర్స్. ఈ సినిమాలో నటిస్తున్నందుకు, తన పాత్రకు తనే డబ్బింగ్ చెబుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేసింది కథానాయిక నజ్రియా నజీమ్ ((Nazriya Nazim). మరి ఇందులో ఆమె పాత్రకు ఏ స్థాయిలో పేరు వస్తుందో చూడాలి.