Nayanthara నుంచి Samantha వరకు.. సౌత్‌లోని ఈ 8 మంది టాప్ హీరోయిన్లకు ఎంతెంత రెమ్యూనరేషన్ అంటే..

ABN , First Publish Date - 2022-06-16T01:14:45+05:30 IST

బాలీవుడ్‌కు దీటుగా దక్షిణాది ఇండస్ట్రీ సినిమాలు నిర్మిస్తుంది. నాణ్యత పరంగా నిర్మాతలు ఎక్కడ రాజీ పడటం లేదు. కొన్ని సార్లయితే బీ టౌన్‌ను మించి ఖర్చు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌కు ఏ మాత్రం

Nayanthara నుంచి Samantha వరకు.. సౌత్‌లోని ఈ 8 మంది టాప్ హీరోయిన్లకు ఎంతెంత రెమ్యూనరేషన్ అంటే..

బాలీవుడ్‌కు దీటుగా దక్షిణాది ఇండస్ట్రీ సినిమాలు నిర్మిస్తుంది. నాణ్యత పరంగా నిర్మాతలు ఎక్కడ రాజీ పడటం లేదు. కొన్ని సార్లయితే బీ టౌన్‌ను మించి ఖర్చు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌కు ఏ మాత్రం వెనుకాడటం లేదు. సినిమాకు హీరో, హీరోయిన్లే ముఖ్యం కాబట్టి వారి పారితోషికాలు ఆకాశనంటుతున్నాయి. మహిళా ప్రాధాన్య చిత్రాలకు కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్స్‌పై ఓ లుక్కేద్దామా..


నయనతార (Nayanthara): 

లేడీ సూపర్ స్టార్ నయనతార కొన్ని రోజుల క్రితమే పెళ్లి చేసుకుంది. దర్శకుడైన విఘ్నేశ్ శివన్‌తో కలసి కొత్త బంధాన్ని ఆరంభించింది. ప్రస్తుతం జయం రవితో కలసి ఓ సినిమా చేస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.10కోట్లను రెమ్యూనరేషన్‌గా అందుకొబోతుందని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. 

 

సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu): 

దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోను వరుసపెట్టి సినిమాలు చేస్తున్న కథానాయిక సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu). కొన్నేళ్లుగా హీరోయిన్ ఓరియెంటేడ్ సినిమాల్లోనే నటిస్తుంది. ‘పుష్ప’ లో ఐటం సాంగ్‌తో అభిమానులను అలరించింది. సమంత ప్రస్తుతం రూ. రూ. 3కోట్ల నుంచి రూ. 5కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటుందని తెలుస్తోంది.  


పూజా హెగ్డే (Pooja Hegde):

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ పూజా హెగ్డే. సౌత్‌లోని టాప్ హీరోలందరి సరసన నటించింది. తాజాగా విజయ్ దేవరకొండతో ‘జనగణమన’ చిత్రాన్ని చేస్తుంది. ఈ సినిమా కోసం ఆమె భారీగా రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేసిందట. ఈ మూవీ కోసం రూ. 5కోట్లను పారితోషికంగా తీసుకొబోతున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.


రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh): 

దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్స్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో నటిస్తుంది.  కాల్షీట్స్‌ను బట్టి రకుల్ ఒక్కో చిత్రానికి దాదాపుగా రూ. 3.5కోట్లను రెమ్యూ‌నరేషన్‌‌గా తీసుకుంటుందట. కథ, పాత్ర బాగుంటే పారితోషికం తగ్గించుకోవడానికీ సిద్దమేనంటుంది.  


తమన్నా భాటియా (Tamannaah Bhatia):

తమన్నా చిన్న తనంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్స్ పక్కన కథానాయికగా అలరిస్తుంది. ఆమె రూ. 3కోట్లను పారితోషికంగా తీసుకుంటుందని తెలుస్తోంది.  


రష్మిక మందన్న(Rashmika Mandanna):

‘పుష్ప’ సినిమాతో రష్మిక మందన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో శ్రీవల్లిగా కనిపించి దేశమంతట అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోను చిత్రాలు చేస్తుంది. రష్మిక ఒక్కో సినిమాకు రూ. 3కోట్లను రెమ్యూనరేషన్‌గా తీసుకుంటుందట.  

 

అనుష్క శెట్టి (Anushka Shetty):

‘బాహుబలి’ ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. ఈ సినిమాలో దేవసేనగా అభిమానులను అలరించింది. స్వీటీ ఒక్కో చిత్రానికి రూ. 4కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. 


కీర్తి సురేష్ (Keerthy Suresh):

కుటుంబ కథా చిత్రాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే అందాల భామ కీర్తి సురేష్ (Keerthy Suresh). ‘మహానటి’ సినిమాతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. తాజాగా ‘చిన్ని’, ‘సర్కారు వారి పాట’ వంటి సినిమాల్లో కనిపించింది. ఆమె ఒక్కో సినిమాకు రూ. 2కోట్లను పారితోషికంగా తీసుకుంటుందట.

Updated Date - 2022-06-16T01:14:45+05:30 IST