Nayanthara: దుబాయ్‌లో విఘ్నేశ్ శివన్‌ను సర్‌ప్రైజ్ చేసిన నయన్

ABN , First Publish Date - 2022-09-19T01:20:17+05:30 IST

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), ప్రియుడు విఘ్నేశ్ శివన్‌ను (Vignesh Shivan) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మహాబలిపురంలోని ప్రముఖ రిసార్ట్‌లో జూన్ 9న వీరి వివాహం ఘనంగా

Nayanthara: దుబాయ్‌లో విఘ్నేశ్ శివన్‌ను సర్‌ప్రైజ్ చేసిన నయన్

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), ప్రియుడు విఘ్నేశ్ శివన్‌ను (Vignesh Shivan) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మహాబలిపురంలోని ప్రముఖ రిసార్ట్‌లో జూన్ 9న వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సెలబ్రిటీలు అనేక మంది హాజరయ్యారు. విఘ్నేశ్ శివన్ సెప్టెంబర్ 18న పుట్టిన రోజు జరుపుకొన్నాడు. భర్త పుట్టిన రోజును నయన్ స్పెషల్‌గా మార్చింది. దుబాయ్‌లో అర్ధరాత్రి బుర్జ్ ఖలీఫా కింద సంబరాలను సెలబ్రేట్ చేసింది. నయన్ ఇచ్చిన పార్టీతో విఘ్నేశ్ సర్‌ప్రైజ్ అయ్యాడు. సంతోషంలో మునిగి తేలాడు. పుట్టిన రోజు సంబరాలకు సంబంధించిన ఫొటోలను విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ‘‘నా భార్య, కుటుంబ సభ్యులు ఇచ్చిన సర్‌ప్రైజ్ బర్త్ డే పార్టీ. ప్రియమైన వారందరు కలసి బుర్జ్ ఖలీపా కింద నా పుట్టిన రోజు సంబరాలను సెలబ్రేట్ చేశారు. ఇంత కంటే ప్రత్యేకమైన పార్టీ నా జీవితంలో వస్తుందనుకోవడం లేదు. అద్భుతమైన జీవితాన్ని, అందమైన జ్ఞాపకాలను ఇచ్చినందుకు ఎల్లప్పుడు దేవుడికి కృతజ్ఞతలు’’ అని విఘ్నేశ్ శివన్ పోస్ట్ పెట్టాడు. 


నయన్, విఘ్నేశ్ ఏడేళ్ల పాటు సహజీవనం చేశారు. జూన్ 9న పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి సెలబ్రిటీలు అనేక మంది హాజరయ్యారు. షారూఖ్ ఖాన్, రజినీ కాంత్, ఏఆర్. రెహమాన్, సూర్య, జ్యోతిక తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. పెళ్లి కాగానే ఈ దంపతులు హానీమూన్‌కు థాయ్‌లాండ్‌కు వెళ్లారు. నయన్, విఘ్నేశ్‌ల పెళ్లి నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆ సంస్థే అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ‘‘నయనతార, విఘ్నేశ్ శివన్ నెట్‌ప్లిక్స్‌కు వచ్చేస్తున్నారు. అందుకు మేం సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నాం’’ అని ఆ సంస్థ ట్వీట్ చేసింది. స్ట్రీమింగ్ డేట్‌ను మాత్రం నెట్‌ప్లిక్స్ ప్రకటించలేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానున్న మొదటి సెలబ్రిటీ దంపతుల వివాహం నయన్‌దే కావడం విశేషం. ఇక కెరీర్ విషయానికి వస్తే.. నయనతార చివరగా ‘O2’ లో నటించింది. ప్రస్తుతం ‘జవాన్’ (Jawan) లో నటిస్తుంది. షారూఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియాగా రూపొందుతుంది. పలు భాషల్లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. విఘ్నేశ్ శివన్ తన తదుపరి సినిమాను అజిత్‌తో చేయనున్నాడు. 



Updated Date - 2022-09-19T01:20:17+05:30 IST