లాక్‌ డౌన్‌ ముందు రోజు...!

ABN , First Publish Date - 2022-12-10T06:32:24+05:30 IST

నయనతార కథానాయికగా నటించిన చిత్రం ‘కనెక్ట్‌’. అనుపమ్‌ ఖేర్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫీసా కీలక పాత్రలు పోషించారు.

లాక్‌ డౌన్‌ ముందు రోజు...!

నయనతార కథానాయికగా నటించిన చిత్రం ‘కనెక్ట్‌’. అనుపమ్‌ ఖేర్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫీసా కీలక పాత్రలు పోషించారు. అశ్విన్‌ శరవణన్‌ దర్శకుడు. విఘ్నేశ్‌ శివన్‌ నిర్మాత. ఈనెల 22న యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. శుక్రవారం ట్రైలర్‌ ఆవిష్కరించారు. ‘‘హారర్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇప్పటి వరకూ ఈ జోనర్‌లో వచ్చిన చిత్రాలకంటే భిన్నంగా ఉంటుంది. దేశంలో లాక్‌ డౌన్‌ విధించడానికి 24 గంటల ముందు ఈ కథ మొదలవుతుంది. ట్రైలర్‌ అందరికీ నచ్చింది. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంద’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. సంగీతం: ఫృథ్వీ చంద్రశేఖర్‌. 

Updated Date - 2022-12-10T06:32:24+05:30 IST