పెళ్లి బహుమతిగా Vignesh Shivan కు రూ.20 కోట్ల బంగ్లా.. ఎవరు ఇచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..!

ABN , First Publish Date - 2022-06-10T18:32:14+05:30 IST

లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో తాజాగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే...

పెళ్లి బహుమతిగా Vignesh Shivan కు రూ.20 కోట్ల బంగ్లా.. ఎవరు ఇచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..!

లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో తాజాగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల డేటింగ్ తర్వాత ఈ జంట జూన్ 9న చెన్నై రిసార్ట్‌లో పెళ్లితో ఒకటయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ మ్యారేజ్‌కి వివిధ సినీ పరిశ్రమలకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరి పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ జంట గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది.


పెళ్లి అంటే గిఫ్ట్‌లు ఇచ్చి పుచ్చుకోవడాలు సాధారణం. వీరి పెళ్లిలో విఘ్నెష్‌కి రూ.20 కోట్లు విలువ చేసే బంగ్లా గిఫ్ట్‌‌గా వచ్చిందట. ఆ బహుమతి ఇచ్చింది ఎవరో కాదు.. నూతన వధువు, విఘ్నేష్ భార్య నయనతారనే. దీనికి సంబంధించిన డాక్యుమెంటెషన్ వర్క్ పూర్తయిందట. అంతేకాకుండా ఈ నటి ఆ బంగ్లాని భర్త విఘ్నేష్ పేరు మీదే రిజిస్టర్ చేయించిందట. అలాగే.. ఈ నటి తన భర్త సోదరికి సైతం దాదాపు 24 తులాల బంగారు నగలని బహుమతిగా ఇచ్చిందట. దాంతోపాటు దగ్గరి బంధువులకి సైతం నయనతార విలువైన వస్తువులను బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం.


అయితే.. బహుమతులు ఇవ్వడంలో విఘ్నేష్ సైతం ఏ మాత్రం తక్కువ చేయలేదు. వివాహ వేడుకలో నయనతార ధరించిన రూ.2.5 నుంచి 3 కోట్లు విలువ చేసే నగలని ఈ దర్శకుడే కొన్నాడట. అంతేకాకుండా నయనతారకు రూ.5 కోట్ల రూపాయల విలువైన డైమండ్ రింగ్‌ను కూడా బహుమతిగా ఇచ్చాడని తెలుస్తోంది. కాగా.. ఈ సెలబ్రిటీ జంట పెళ్లి వేడుకకి రజనీకాంత్, దళపతి విజయ్, విజయ్ సేతుపతి, దర్శకుడు అట్లీ, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌తోపాటు మరికొందరు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకలో ఎంతో ముఖ్యమైన మంగళసూత్రాన్ని స్వయంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ తన చేతుల మీదుగా వధూవరులకీ అందించడం ఇక్కడ విశేషం.


నిజానికి.. మొదట తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఈ జంట అనుకుంది. కానీ.. ప్రయాణ ఇబ్బందులు, అతిథులకి వసతి వంటి ఇతర ఇబ్బందుల కారణంగా మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌కి వేదికను మార్చారు. వచ్చే అతిథుల కోసం ఆ రిసార్టులోని 129 గదులను ఈ జంట బుక్ చేసిందట. పెళ్లికి కొందరినే ఆహ్వానించడం వల్ల.. బంధు మిత్రులందరి కోసం ఓ గ్రాండ్ రిసెప్షన్‌ని ఏర్పాటు చేసేందుకు ఈ జంట సిద్ధమవుతోంది.

Updated Date - 2022-06-10T18:32:14+05:30 IST