Nayanthara-Vignesh Shivan's wedding: వైరల్ అవుతున్న ఆహ్వాన వీడియో..

ABN , First Publish Date - 2022-06-08T16:33:04+05:30 IST

ప్రముఖ నటి నయనతార, డైరెక్టర్, నిర్మాత విఘ్నేష్ శివన్ జూన్ 9న మహాబలిపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో వివాహం..

Nayanthara-Vignesh Shivan's wedding: వైరల్ అవుతున్న ఆహ్వాన వీడియో..

ప్రముఖ నటి నయనతార, డైరెక్టర్, నిర్మాత విఘ్నేష్ శివన్ జూన్ 9న మహాబలిపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ గత ఆరేళ్లుగా డేటింగ్‌లో ఉండగా.. 2021లో నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే జూన్ 7న చెన్నైలోని తాజ్ క్లబ్ హౌస్‌లో విలేకరుల సమావేశంలో విఘ్నేష్ వివాహ వివరాలను అధికారికంగా ప్రకటించాడు. 


‘మొదట తిరుపతిలోని ఒక ఆలయంలో వివాహాన్ని ప్లాన్ చేశామని, అయితే ప్రయాణ ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే పెళ్లి వేదికను మహాబలిపురానికి మార్చాం’ అని విఘ్నేష్ చెప్పుకొచ్చాడు. పెళ్లి గురించి అనౌన్స్‌మెంట్ చేసిన కొద్దిసేపటికే ఈ కపుల్ మ్యారేజ్ ఆహ్వాన వీడియో సోషల్ ‌మీడియాలో వైరల్‌గా మారింది. అందులో.. ఈ కపుల్ మొదట కలిసి పనిచేసిన ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమా చెందిన నేపథ్య సంగీతాన్ని యాడ్ చేశారు. 2015లో వచ్చిన ఈ యాక్షన్ కామెడీ చిత్రాన్ని ధనుష్ నిర్మించగా.. విజయ్ సేతపతి, నయనతార ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీకి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు.


ఆ వీడియోలో.. ‘సర్వశక్తిమంతుడైన దేవుడు, మా పెద్దలు, ఈ యూనివర్స్ ఆశీర్వాదంతో.. కురియన్ కొడియట్టు, శ్రీమతి ఓమన కురియన్ కుమార్తె నయనతార.. శ్రీ శివకొలుందు, శ్రీమతి మీనాకుమారి కుమారుడు విఘ్నేష్ శివన్ వివాహ వేడుకకు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. 9 జూన్ 2022(గురువారం), షెరటన్ గ్రాండ్ మహాబలిపురం’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఈ జంటకు విషెస్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-06-08T16:33:04+05:30 IST