Nayanathara : భర్తకోసం మరో బంగ్లా కొనుగోలు

ABN , First Publish Date - 2022-07-06T01:36:00+05:30 IST

సౌత్ లేడీ సూపర్ స్టార్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కథానాయిక నయనతార (Nayanathara). గత నెల్లో ఆమె బాయ్ ఫ్రెండ్, తమిళ దర్శకుడు అయిన విఘ్నేశ్ శివన్‌ (Vighnesh Shivan) ను పెళ్లిచేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

Nayanathara : భర్తకోసం మరో బంగ్లా కొనుగోలు

సౌత్ లేడీ సూపర్ స్టార్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కథానాయిక నయనతార (Nayanathara). గత నెల్లో ఆమె బాయ్ ఫ్రెండ్, తమిళ దర్శకుడు అయిన విఘ్నేశ్ శివన్‌ (Vighnesh Shivan) ను పెళ్లిచేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో రెండు సార్లు ప్రేమలో తీవ్రంగా విఫలమైనప్పటికీ.. తన కెరీర్ పై ఏమాత్రం దాని ప్రభావం పడకుండా.. ముందుకు సాగింది. ఇప్పుడు మనసుకునచ్చిన వాడ్ని మనువాడి.. మరింతగా ధైర్యంతో ముందుకు సాగుతోంది. కొత్త కథానాయికలు ఎంతమంది వచ్చినా.. నయనతార మాత్రం తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని.. సినిమాలతో నిత్యం బిజీగా ఉంటోంది. 


ఇక తన  పెర్సనల్ లైఫ్‌పై .. సినిమాల ప్రభావం పడకుండా.. తన కెరీర్ ముందుకు నడిపిస్తోంది. అసలు విషయానికొస్తే..  ఇటీవల విఘ్నేశ్ శివన్‌ను పెళ్ళి చేసుకున్న సందర్బంగా ప్రత్యేకంగా ఒక ఇంటిని కొనుగోలు చేసింది నయన్. ఇదివరకే ఆమె చెన్నైలోని ఒక కాస్ట్లీ ఏరియాలో ప్రత్యేకమైన బంగ్లాను కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు తన భర్తతో ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో చెన్నై పోయస్ గార్డెన్ (Pous garden) లో ఏకంగా.. రెండు ఇళ్ళను కొనుగోలు చేసినట్టు సమాచారం. 8వేల చదరపు అడుగుల స్థలంలో ఆమె ఇప్పుడు ఒక బంగ్లాను రీమోడలింగ్ చేయిస్తోందట. అందులో ఇంటీరియర్ డిజైన్ కోసమే ఏకంగా రూ. 25కోట్లు ఖర్చుచేసిందట. పూర్తిగా ఆ ఇంటిని తన భర్త పేరుమీదే కొనుగోలు చేసిందని టాక్. 


పోయెస్ గార్డెన్ లో ఎక్కువగా సెలబ్రిటీస్ ఉంటారు. రజనీకాంత్ (Rajanikanth), జయలలిత (Jayalalitha), శశికళ (Shashikala).. ఇంకా కొంతమంది రాజకీయ ప్రముఖులు ఖరీదైన బంగ్లాల్లో ఉంటున్నారు. ఆ లిస్ట్ లోకి ఇప్పుడు నయనతార కూడా వచ్చి చేరింది. అందులో ఒక స్విమ్మింగ్ పూల్ ను కూడా ప్రత్యేకించి నిర్మించుకుందట. త్వరలోనే తన భర్తతో ఆ బంగ్లాలో గృహప్రవేశం చేయబోతోంది. 

Updated Date - 2022-07-06T01:36:00+05:30 IST