Nayanathara : పెళ్ళి తర్వాత సినిమాలకు గుడ్ బై ?

ABN , First Publish Date - 2022-06-08T20:58:18+05:30 IST

పెళ్యయ్యాకా సినీ జీవితానికి గుడ్ బై చెప్పి.. వైవాహిక జీవితానికే అంకితమైపోయారు పలువురు కథానాయికలు. కొందరు భర్తను ఒప్పించి సినిమాల్లో కంటిన్యూ చేస్తే.. మరికొందరు భర్త మాటకు విలువిచ్చి సినీ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టారు. సినిమాల్లో నటించడం, నటించకపోవడం వారి వ్యక్తిగత విషయం.

Nayanathara : పెళ్ళి తర్వాత సినిమాలకు గుడ్ బై ?

పెళ్యయ్యాకా సినీ జీవితానికి గుడ్ బై చెప్పి.. వైవాహిక జీవితానికే అంకితమైపోయారు పలువురు కథానాయికలు. కొందరు భర్తను ఒప్పించి సినిమాల్లో కంటిన్యూ చేస్తే.. మరికొందరు భర్త మాటకు విలువిచ్చి సినీ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టారు. సినిమాల్లో నటించడం, నటించకపోవడం వారి వ్యక్తిగత విషయం. అయితే క్రేజీ కథానాయికల విషయంలో మాత్రం అది అభిమానుల్ని కలవరపెట్టేదే. నయనతార (Nayanathara) విషయంలో ఇలాగే అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  ఈ నెల 9న నయనతార తన మనసుకు నచ్చిన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ (Vighnesh Shivan) ను మనువాడబోతున్న సంగతి తెలిసిందే. మహాబలిపురం వారి వివాహానికి వేదిక కాబోతోంది. ఇప్పటికే ఈ జోడీ.. తన స్నేహితులకు, స్ననిహితులకు , బంధువులకు తమ వెడ్డింగ్ ఇన్టిటేషన్స్‌ను పంపించారు. కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ నుంచి పలువరు సినీ ప్రముఖులు వీరి పెళ్ళికి హాజరవుతున్నారు. 


ఈ క్రమంలో పెళ్ళి తర్వాత నయనతార సినిమాల్ని కొనసాగిస్తుందా? లేక వైవాహిక జీవితానికే కట్టుబడుతుందా అనే విషయంలో అభిమానులు సంధిగ్ధంలో ఉన్నారు. అయితే ఆమె అందరూ ఊహిస్తున్నట్టుగానే పెళ్ళి తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మధ్య నయనతార తనకు ఫ్యామిలీ లైఫ్ ముఖ్యమని, వైవాహిక జీవితాన్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలని చెప్పిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఆమె వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని భావిస్తోందని టాక్స్ వినిపిస్తున్నాయి. అందుకే ప్రస్తుతం నయనతార కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదని, ప్రస్తుతం కమిట్ అయిన మేరకే సినిమాల్లో నటించి.. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనుందని తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి. 


నయనతార నటించిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్ ఫాదర్ (Godfather), ఓ2 (O2), గోల్డ్ (Gold)’ లాంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటి తర్వాత ఆమె ఏ సినిమాలకైనా కమిట్ అయితే.. వాటిని పెళ్ళి తర్వాత పూర్తి చేయబోతోందని టాక్. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు కానీ.. కథానాయికగా టాప్ లీడ్ లో ఉన్న ఆమె పెళ్ళి కారణంగా సినిమాల్లో నటించడం మానేయడం మాత్రం అభిమానులకు నిజంగా బ్యాడ్ న్యూస్ కిందే లెక్క. మరి ఈ విషయంలో నయనతార ఫైనల్ డెసిషన్ ఏంటో చూడాలి. 

Updated Date - 2022-06-08T20:58:18+05:30 IST