నయనానందకరంగా Nayanathara - Vighnesh Shivan పెళ్ళి

ABN , First Publish Date - 2022-06-09T20:56:23+05:30 IST

సౌత్ లేడీసూపర్ స్టార్ నయతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాహం నేడు (జూన్ 9) మహాబలిపురంలో కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, సూపర్ స్టార్‌ రజినీకాంత్, దర్శకుడు అట్లీ, అజిత్, బోనీకపూర్, విజయ్ సేతుపతి లాంటి తమిళ సినీ ప్రముఖులు హాజరయ్యారు.

నయనానందకరంగా Nayanathara - Vighnesh Shivan పెళ్ళి

సౌత్  లేడీసూపర్ స్టార్ నయతార (Nayanathara), తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vighnesh Shivan) వివాహం నేడు (జూన్ 9) మహాబలిపురంలో కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, సూపర్ స్టార్‌ రజినీకాంత్, దర్శకుడు అట్లీ, అజిత్, బోనీకపూర్, విజయ్ సేతుపతి లాంటి తమిళ సినీ ప్రముఖులు హాజరయ్యారు. మహాబలిపురంలోని ఒక ప్రముఖ స్టార్ హోటల్‌లో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్ళి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నయనతారను పెళ్ళికూతురుగా చూస్తూ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. 


నయనతార, విఘ్నేష్ లిద్దరూ తమ వివాహ విషయాన్ని ప్రకటించినప్పటినుంచి అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేశారు.  అసలు ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ (Wedding Invitation) నే క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారు కూడా. నిజంగా అది వారి పెళ్ళి కార్డే అనేంతగా ఆ వివాహ ఆహ్వానపత్రిక సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారు అంతగా ముచ్చటపడ్డ నయనతార పెళ్ళి వేడుక మొత్తానికి అత్యంత వైభవంగా జరగడంతో వారి ఆనందానికి అంతే లేకుండా పోయింది. నయనతార, విఘ్నేష్ దంపతులకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షల సందేశాలు అందుతున్నాయి. 

Updated Date - 2022-06-09T20:56:23+05:30 IST