ముఖ్యమంత్రిని తమ పెళ్లికి ఆహ్వానించిన Nayan - Vignesh Sivan..

ABN , First Publish Date - 2022-06-05T19:08:18+05:30 IST

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) ను కలిసి తమ వివాహహానికి రావాల్సిందిగా కోరారు స్టార్ హీరోయిన్ నయనతార (Nayanathara), విఘ్నేష్ శివన్ (Vignesh Shivan).

ముఖ్యమంత్రిని తమ పెళ్లికి ఆహ్వానించిన Nayan - Vignesh Sivan..

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) ను కలిసి తమ వివాహహానికి రావాల్సిందిగా కోరారు స్టార్ హీరోయిన్ నయనతార (Nayanatara), విఘ్నేష్ శివన్ (Vignesh Shivan). ఈనెల 9వ తేదీన ఈ జంట వివాహం ఎంతో వైభవంగా జరగనుంది. మహాబలిపురంలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో హిందూ సంప్రదాయాల ప్రకారం నయన్ - విఘ్నేష్‌ల పెళ్లి జరగనుందని సమాచారం. తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల మధ్య విఘ్నేష్ నయన్ మెడలో తాళి కట్టనున్నట్టు తెలుస్తోంది. అదే వేదికపై జూన్ 8 సాయంత్రం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు.. పలువురు రాజకీయ నాయకుల కోసం గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారట.


వీరి వివాహానికి కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్- మెగాస్టార్ చిరంజీవి- విశ్వనటుడు కమల్ హాసన్- బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ కోలీవుడ్ స్టార్స్ అజిత్- విజయ్- సూర్య- కార్తీ- విజయ్ సేతుపతి- విజయ్ సేతుపతి వంటి టాప్ సెలబ్రిటీలు హాజరుకానున్నారట. నయనతార ప్రస్తుతం షారూక్ సరసన 'జవాన్' సినిమాలో నటిస్తున్నారు. అందుకే, బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్‌ను నయన్ ఆహ్వానించిందట.  


ఇక ఇప్పటికే నయన్ - విఘ్నేష్ స్వయంగా పలువురిని తమ వివాహ వేడుకకు ఆహ్వానించడానికి కలుసుకుంటున్నారు. 9 జూన్ 2022న మహాబలిపురంలో జరగనున్న తమ వివాహ వేడుకకు ఆహ్వానించేందుకు నయనతార- విఘ్నేష్ శివన్ ఇద్దరూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిశారు. సినీనటుడు.. సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను కూడా ఆహ్వానించారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. కాగా, తెలుగులో నయనతార మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో నటిస్తున్నారు. 

Updated Date - 2022-06-05T19:08:18+05:30 IST