నవ్వుల షికారు

ABN , First Publish Date - 2022-06-27T10:03:47+05:30 IST

సాయిధన్సిక, తేజ్‌ కూరపాటి జంటగా నటించిన చిత్రం ‘షికారు’. ‘యాన్‌ అన్‌లిమిటెడ్‌ ఫన్‌ రైడ్‌’ అనేది ఉపశీర్షిక....

నవ్వుల షికారు

సాయిధన్సిక, తేజ్‌ కూరపాటి జంటగా నటించిన చిత్రం ‘షికారు’. ‘యాన్‌ అన్‌లిమిటెడ్‌ ఫన్‌ రైడ్‌’ అనేది ఉపశీర్షిక. హరి కొలగాని దర్శకత్వంలో పి.ఎస్‌.ఆర్‌ కుమార్‌ (బాబ్జీ, వైజాగ్‌) నిర్మించారు. జులై 1న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ఆదివారం చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. సాయిధన్సిక మాట్లాడుతూ ‘దర్శకుడు నాకు అందమైన పాత్ర ఇచ్చారు. సినిమా ఆధ్యంతం నవ్వులు పంచుతుంది. సినిమా కోసం వైజాగ్‌ నుంచి నెల్లూరు వరకూ రోడ్‌ ట్రిప్‌ చేయడం సంతోషం కలిగించింద’న్నారు. మంచి కటెంట్‌ ఉన్న సినిమా ఇది... దిల్‌రాజు, సురేష్‌బాబు సహకారంతో జులై 1న థియేటర్లలోకి రాబోతున్నాం అని బాబ్జీ చెప్పారు. కామెడీలో అరాచకం ఎలా ఉండబోతోందో మా ‘షికారు’ సినిమా చూపిస్తుందని హరి కొలగాని అన్నారు. 


Updated Date - 2022-06-27T10:03:47+05:30 IST