నాలో ఆ గట్స్ ఉన్నాయ్: Natural Star Nani

ABN , First Publish Date - 2022-06-14T02:00:23+05:30 IST

‘‘ఇది మనందరి సినిమా. ఇది మనందరి విజయం. మనందరి సెలబ్రేషన్. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్, అభిమానులు పెడుతున్న మెసేజులు చూస్తుంటే కడుపు నిండిపోయింది. చాలా ఆనందంగా వుంది. నా కెరీర్ టాప్ ఆర్డర్‌లో వుండే సినిమా ‘అంటే సుందరానికీ’

నాలో ఆ గట్స్ ఉన్నాయ్: Natural Star Nani

‘‘ఇది మనందరి సినిమా. ఇది మనందరి విజయం. మనందరి సెలబ్రేషన్. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్, అభిమానులు పెడుతున్న మెసేజులు చూస్తుంటే కడుపు నిండిపోయింది. చాలా ఆనందంగా వుంది. నా కెరీర్ టాప్ ఆర్డర్‌లో వుండే సినిమా ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki)’’ అని అన్నారు నేచురల్ స్టార్ నాని (Natural Star Nani). ఆయన హీరోగా.. నజ్రియా ఫహద్ (Nazriya Fahadh) హీరోయిన్‌గా.. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌‌టైనర్ ‘అంటే సుందరానికీ’. జూన్ 10న విడుదలైన ఈ చిత్రం.. విజయవంతంగా ప్రదర్శింపబడుతోన్న నేపథ్యంలో.. చిత్రయూనిట్ తాజాగా ‘అంటే సుందరానికీ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్’ కార్యక్రమాన్ని నిర్వహించింది.


ఈ కార్యక్రమంలో హీరో (Nani) నాని మాట్లాడుతూ.. ‘‘ఈ విజయం టీం సమిష్టి కృషి వల్ల వచ్చింది.  ‘అంటే సుందరానికీ’ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. అయితే ఈ సెలబ్రేషన్ కేవలం బాక్సాఫీసు నెంబర్లే కాదు.. ఈ రోజు ప్రేక్షకుల హృదయాలని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా సినిమాకి దక్కిన ప్రేమని, ప్రేక్షకుల ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బ్లాక్‌బస్టర్ అనేది సమయం చెబుతుంది. కానీ సినిమా చూసిన వారి కళ్ళల్లో ఆనందం, వారి ప్రేమ విషయంలో ఈ సినిమా ఆల్రెడీ బ్లాక్‌బస్టర్ కొట్టేసింది. దాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అంటే సుందరానికీ  కూడా అలా అరుదైన సినిమానే. ఈ చిత్రానికి మరో చిత్రంతో పోలిక లేదు. ఇలా అరుదుగా వచ్చే సినిమాని మనం అందరం భుజాన వేసుకొని ముందుకు తీసుకెళ్తే తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగులో మనం భాగమౌతాం. ఇది మనందరి  సినిమా. ఇది మనందరి విజయం. మనందరి సెలబ్రేషన్. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్, అభిమానులు పెడుతున్న మెసేజులు చూస్తుంటే కడుపు నిండిపోయింది. చాలా ఆనందంగా వుంది. నా కెరీర్ టాప్ ఆర్డర్ లో వుండే సినిమా ‘అంటే సుందరానికీ’. సులువైన మార్గాలు చాలా ఉన్నపుడు ఇలాంటి కథ చెప్పడానికి చాలా గట్స్ కావాలి. ఆ గట్స్ మా దర్శకుడు వివేక్ ఆత్రేయలో వున్నాయి. మా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్‌లో వున్నాయి. నాలో, మా టీమ్ అందరిలో వున్నాయి. ఇది ఆవకాయ్ వంటి సినిమా. మూడు రోజులు రుచి చూశారంటే  రోజురోజుకి ఊరుతుంది. రుచి ఇంకా పెరుగుతుంది. రెండేళ్ళ తర్వాత కూడా మంచి తెలుగు సినిమా పేర్లు చెప్పమని ఎవరైనా అడిగితే చెప్పే రెండు మూడు పేర్లలో అంటే సుందరానికీ చిత్ర పేరు ఉంటుంది’’ అన్నారు. (Ante Sundaraniki)

Updated Date - 2022-06-14T02:00:23+05:30 IST