నేచురల్ స్టార్ నాని వదిలిన ‘ముత్తయ్య’ టీజర్

ABN , First Publish Date - 2022-05-01T01:31:19+05:30 IST

కె. సుధాకర్ రెడ్డి, అరుణ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ముత్తయ్య’. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సమర్పణలో..

నేచురల్ స్టార్ నాని వదిలిన ‘ముత్తయ్య’ టీజర్

కె. సుధాకర్ రెడ్డి, అరుణ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ముత్తయ్య’. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సమర్పణలో.. హైలైఫ్ ఎంటర్‪టైన్‪మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్‪టైన్‪మెంట్ బ్యానర్స్‪పై  వ్రిందా ప్రసాద్ నిర్మించారు. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర టీజర్ ని నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. అనంతరం నాని మాట్లాడుతూ..  ‘‘24 ఏళ్ల వయసులో నాకు ‘అష్టా చమ్మా’ సినిమాలో అవకాశం రాకుంటే 70 ఏళ్లకు నేనూ ముత్తయ్యలాగే అయ్యేవాడిని. టీజర్ మనసుకు హత్తుకుంది. చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్’’ అని తెలిపారు. జీవితంలో ఒక్క సినిమాలోనైనా నటించాలని కోరుకునే వ్యక్తి ముత్తయ్య. అతని కోరిక నెరవేరిందా లేదా అనే ఆసక్తిని కలిగిస్తూ సాగింది ‘ముత్తయ్య’ సినిమా టీజర్. యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‪కు అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించిందీ చిత్రం. మే 9న లండన్ లోని రిచ్ మిక్స్ లో ప్రీమియర్ కానుంది. 


టీజర్ విడుదల సందర్భంగా చిత్ర సమర్పకులు కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి మాట్లాడుతూ.. మా సినిమా టీజర్ ను నాని విడుదల చేయడం సంతోషంగా ఉంది. మా సంస్థ తరపున ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాం. ముత్తయ్య ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచే సినిమా అవుతుంది.. అన్నారు. నిర్మాత వ్రిందా ప్రసాద్ మాట్లాడుతూ.. మా సినిమా టీజర్ విడుదల చేసినందుకు నానికి థాంక్స్. జీవితంలో ఏదైనా సాధించాలని కలగనే ప్రతి ఒక్కరూ ముత్తయ్యలో కనిపిస్తారు. అలాంటి వారి భావోద్వేగాలను దర్శకుడు భాస్కర్ మౌర్య ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. మా సినిమా యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైనందుకు గర్వంగా ఉంది.. అన్నారు. దర్శకుడు భాస్కర్ మార్య మాట్లాడుతూ.. తమ కలలను సాకారం చేసుకోవాలని ప్రయత్నించే ఎంతోమంది వ్యక్తుల ఆరాటానికి ప్రతిబింబం ఈ సినిమా. అలాంటి వాళ్ల నుంచి స్ఫూర్తి పొందే ఈ కథ రాసుకున్నాను. నా కథను అందంగా తెరకెక్కించేందుకు సహకరించిన టీమ్ అందరికీ థాంక్స్ అని పేర్కొన్నారు.





Updated Date - 2022-05-01T01:31:19+05:30 IST