Dasara: ‘పుష్ప’ని అనుకరిస్తున్న నాని

ABN , First Publish Date - 2022-08-30T23:11:19+05:30 IST

అల్లు అర్జున్ (Allu Arjun) మరియు సుకుమార్ (Sukumar) కలయికలో వచ్చిన ‘పుష్ప’(Pushpa) సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమాలో కథ ఎర్ర చందనం..

Dasara: ‘పుష్ప’ని అనుకరిస్తున్న నాని

అల్లు అర్జున్ (Allu Arjun) మరియు సుకుమార్ (Sukumar) కలయికలో వచ్చిన ‘పుష్ప’(Pushpa) సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమాలో కథ ఎర్ర చందనం.. దీనిని అక్రమ రవాణా కోసం కొంతమంది ఎటువంటి దారుణానికైనా పాల్పడతారనే నేపథ్యంలో ఉంటుంది. అల్లు అర్జున్ తన రూపు రేఖలను పూర్తిగా మార్చేసే ఈ సినిమా కోసం డీ-గ్లామరైజ్డ్‌గా నటించాడు. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) కూడా తన సినిమా ‘దసరా’ (Dasara)లో.. అల్లు అర్జున్ ‘పుష్ప’లో ఎలాంటి పాత్రలో కనిపించాడో.. సేమ్ టు సేమ్ ఇందులో అలానే కనిపిస్తాడని టాక్ నడుస్తుంది. 


ఇప్పటికే ‘దసరా’కు సంబంధించి విడుదలైన పోస్టర్స్ కూడా దాదాపు ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశాయి. ‘పుష్ప’లో ఎర్ర చందనం చూట్టూ కథ ఉంటే.. నాని చేసే దసరాలో బొగ్గు చుట్టూ కథ తిరుగుతుంది. నల్ల బంగారం అని ప్రేమగా పిలిచే బొగ్గు కథ ఆధారంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odhela) ‘దసరా’ సినిమా తీస్తున్నట్టు తెలిసింది. నాని ఇందులో డీ-గ్లామరైజ్డ్‌గా కనిపిస్తారని అంటున్నారు. ఈ కథ గోదావరిఖని దగ్గర జరిగే ఒక పల్లెటూరు దగ్గర మొదలవుతుంది. అందుకోసం నిర్మాతలు దాదాపు 100 ఇళ్లతో ఒక పల్లెటూరునే నిర్మించేశారు. ఇందులోనే మొత్తం షూటింగ్ అంతా జరుగుతుందని అంటున్నారు. 


‘దసరా’లో నాని పాత్రకి.. అలాగే ‘పుష్ప’లోని అల్లు అర్జున్ పాత్రకి కొంచెం దగ్గర పోలికలు వుండే అవకాశం వుందని ఇప్పటికే సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే సినిమా విడుదలైన తర్వాత కానీ ఆ విషయం తెలియదు. ‘పుష్ప’ని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాని కూడా పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారని వినికిడి. ప్రస్తుతం శరవేగంతో నాని ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాడు.





Updated Date - 2022-08-30T23:11:19+05:30 IST