నేను సినిమా టికెట్ల ధరలు పెంచమని అడిగిన సందర్భం వేరు: Nani

ABN , First Publish Date - 2022-06-07T03:07:54+05:30 IST

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా.. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌ టైనర్ చిత్రం ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki ). ఈ సినిమాపై ఎటువంటి

నేను సినిమా టికెట్ల ధరలు పెంచమని అడిగిన సందర్భం వేరు: Nani

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా.. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌ టైనర్ చిత్రం ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki ). ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు నెలకొని ఉన్నాయో తెలియంది కాదు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా క్రేజ్ పెంచాయి. ఇందులో నాని సరసన నజ్రియా (Nazriya) హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో హీరో నాని మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో ‘‘మీరు టికెట్ రేట్లు పెంచమని అప్పట్లో అడిగారు.. కానీ ఇప్పుడు నిర్మాతలే స్వతహాగా తగ్గిస్తున్నారు కదా?’’.. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అనే ప్రశ్న నానికి ఎదురైంది. 


దీనికి సమాధానమిస్తూ..‘‘ నిజమే.. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో నా వరకూ వచ్చాయి. అయితే ఇక్కడ ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. నేను టికెట్ రేట్లు పెంచమని అడిగినప్పుడు ఉన్న సందర్భం వేరు. బేసిక్ రేట్లు కంటే బాగా తగ్గించి టికెట్ మరీ  ముఫ్ఫై, నలభై రూపాయిలు చేసినప్పుడు .. ఇంత తక్కువ ధరతో సినిమా ఆడించడం కష్టం.. బేసిక్ రేట్లు పెట్టమని కోరాను. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) వంటి భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. నేను కూడా మిగతా సినిమాలకి రేట్లు పెంచమని అడగలేదు కదా. బేసిక్ రేట్లు కంటే తగ్గించేసినపుడు ఎవరూ బ్రతకలేరని చెప్పాను. నేనేం ఎక్కువ అడగలేదు. ముందువున్న బేసిక్ రేట్లు ఉంచమనే కోరాను. ‘ఆర్ఆర్ఆర్’ భారీ బడ్జెట్ సినిమా. కానీ ఆ సందర్భం మర్చిపోయి ఇలా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు కదా..’’ అని నాని వివరణ ఇచ్చారు.

Updated Date - 2022-06-07T03:07:54+05:30 IST