Natti Kumar: ‘బింబిసార’, ‘సీతా రామం’ సినిమాలు బావున్నాయి... కానీ..!

ABN , First Publish Date - 2022-08-06T00:45:10+05:30 IST

తెలుగు చలనచిత్ర పరిశ్రమ (Tollywood)కు పూర్వ వైభవం రావాలంటే.. సినిమా టికెట్ల ధరలు తగ్గాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.. నిర్మాత, ఫిలిం డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టికుమార్ (Natti Kumar). ప్రస్తుతం టాలీవుడ్‌లో..

Natti Kumar: ‘బింబిసార’, ‘సీతా రామం’ సినిమాలు బావున్నాయి... కానీ..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమ (Tollywood)కు పూర్వ వైభవం రావాలంటే.. సినిమా టికెట్ల ధరలు తగ్గాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.. నిర్మాత, ఫిలిం డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టికుమార్ (Natti Kumar). ప్రస్తుతం టాలీవుడ్‌లో నిర్మాతలు షూటింగ్స్‌కు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. ఎటువంటి చిత్రాన్ని విడుదల చేసినా.. బాక్సాఫీస్ వద్ద పరాజయమే పొందడంతో.. నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. దీంతో నిర్మాతలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రక్షాళన మొదలెట్టారు. ఈ నేపధ్యంలో నట్టికుమార్ టాలీవుడ్‌ని ఉద్దేశిస్తూ.. శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో..  


‘‘శుక్రవారం విడుదలైన రెండు సినిమాలు ‘బింబిసార (Bimbisara), సీతారామం (Sita Ramam)’ సూపర్ హిట్  టాక్ తెచ్చుకుని సినీ పరిశ్రమలో ఎనలేని ఉత్సాహాన్ని నింపాయి. వాస్తవానికి ఆంధ్రప్రదే‌శ్‌ (Andhra Pradesh)తో పోల్చుకుంటే.. తెలంగాణా (Telangana)లో థియేటర్ల టిక్కెట్ల రేట్లు చాలా అధికంగా ఉన్నాయి. దీంతో ఈ రెండు సినిమాలకు ఆంధప్రదేశ్‌లో కలెక్షన్లు చాలా బావుండగా, తెలంగాణాలో మాత్రం ఎంత మంచి టాక్ ఉన్నప్పటికీ థియేటర్లకు జనాలు రావడం లేదు. సూపర్ హిట్ టాక్ వచ్చిన  సినిమాకు కూడా.. టిక్కెట్ల రేట్లు అధికంగా ఉన్న కారణంగా తెలంగాణలోని థియేటర్లకు జనాలు రావడం తగ్గిపోయింది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న రేట్లను కాస్త తగ్గించి, తెలంగాణా థియేటర్లలో రేట్లు కూడా అక్కడి రేట్లకు  సమానంగా.. ఒకేవిధంగా ఉండేలా ప్రస్తుతం ఏర్పడిన తెలుగు ఫిలిం ఛాంబర్ కమిటీ కృషి చేయాలి. దీనిని వెంటనే రెండు ప్రభుత్వాల దృష్టికి తీసుకుని పోయి, సినీ పరిశ్రమకు పూర్వ వైభవాన్ని సంతరించి పెట్టాలని కోరుతున్నాను. ఇక త్వరలో విడుదల కానున్న ‘మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam), కార్తికేయ-2 (Karthikeya 2)’  సినిమాలు కూడా పై సినిమాల లాగా సూపర్ హిట్ అవుతాయని విశ్వసిస్తున్నాను. ఈ ఉత్సాహం సినీ పరిశ్రమలో నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

Updated Date - 2022-08-06T00:45:10+05:30 IST