National Award: ఎక్కువ సార్లు గెలుచుకున్న హీరోలు వీళ్ళే..

ABN , First Publish Date - 2022-07-24T02:05:39+05:30 IST

68వ నేషనల్ అవార్డ్స్ ప్రకటించడంతో ఇండియా వైడ్ ఇప్పుడు, ఇదే టాపిక్ ట్రెండ్ అవుతూ ఉంది. ఈ ఏడాది అజయ్ దేవగన్, సూర్యలు బెస్ట్ హీరో కేటగిరిలో నేషనల్ అవార్డు అందుకున్నారు. అసలు నేషనల్ అవార్డ్స్

National Award: ఎక్కువ సార్లు గెలుచుకున్న హీరోలు వీళ్ళే..

68వ నేషనల్ అవార్డ్స్ (68th National Film Awards) ప్రకటించడంతో ఇండియా వైడ్ ఇప్పుడు, ఇదే టాపిక్ ట్రెండ్ అవుతూ ఉంది. ఈ ఏడాది అజయ్ దేవగణ్ (Ajay Devgn), సూర్య(Suriya)లు బెస్ట్ హీరో కేటగిరిలో నేషనల్ అవార్డు అందుకున్నారు. అసలు నేషనల్ అవార్డ్స్ ఎప్పుడూ స్టార్ట్ అయ్యాయి, ఎక్కువ సార్లు ఎవరు గెలుచుకున్నారు అనే టాపిక్ సోషల్ మీడియా సెర్చ్ లిస్టులో టాప్ ప్లేస్‌లో ఉంది. 1967లో నేషనల్ అవార్డ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు, బెస్ట్ హీరో కేటగిరిలో బెస్ట్ హీరో అవార్డుని బెంగాలీ నటుడు ఉత్తమ్ కుమార్ (Uttam Kumar) గెలుచుకున్నాడు. 


అవార్డ్స్ మొదలుపెట్టిన తర్వాత ఇప్పటివరకూ అత్యధిక సార్లు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న హీరోల్లో... బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నాలుగు అవార్డ్స్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. మూడు అవార్డ్స్‌తో సెకండ్ ప్లేస్‌లో కమల్ హాసన్ (Kamal Haasan), మమ్ముట్టి (Mammootty), అజయ్ దేవగణ్‌ (Ajay Devgn)లు ఉన్నారు. రెండు సార్లు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న వారిలో ధనుష్ (Dhanush), ఓం పూరి (Om Puri), మోహన్ లాల్ (Mohan Lal), నసీరుద్దిన్ షా (Naseeruddin Shah), మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) ఉన్నారు. 


అజయ్ దేవగన్... ‘జఖ్మ్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’ సినిమాలకి గతంలో నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. ఇప్పుడు తన 100వ సినిమా అయిన ‘తానాజీ’కి మూడోసారి నేషనల్ అవార్డు అందుకున్నాడు. అమితాబ్ తర్వాత అన్ని నేషనల్ అవార్డ్స్ అందుకున్న హీరోగా అజయ్ దేవగణ్‌కి స్పెషల్ రికార్డ్ ఉంది. తెలుగు నుంచి ఎంత మంది హీరోలు ఉన్నా, స్టార్స్ ఉన్నా.. ఇప్పటివరకూ అవార్డ్స్ ఫర్ ది బెస్ట్ హీరో అనే కేటగిరిలో ఒక్క నేషనల్ అవార్డు కూడా రాలేదు.

Updated Date - 2022-07-24T02:05:39+05:30 IST