సమకాలీన అంశాలపై ముగ్గురి ఖాన్‌ల మౌనం మంచిది కాదంటున్న Naseeruddin Shah

ABN , First Publish Date - 2022-06-10T00:40:16+05:30 IST

ఏ పాత్రను అయిన అలవోకగా పోషించే బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా (Naseeruddin Shah). సమకాలీన అంశాలపై సినీ ఇండస్ట్రీ స్పందించాలని చెప్పాడు. ఇండస్ట్రీ మౌనంగా ఉండటం అంత శ్రేయస్కరం కాదని

సమకాలీన అంశాలపై ముగ్గురి ఖాన్‌ల మౌనం మంచిది కాదంటున్న Naseeruddin Shah

ఏ పాత్రను అయిన అలవోకగా పోషించే బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా (Naseeruddin Shah). సమకాలీన అంశాలపై సినీ ఇండస్ట్రీ స్పందించాలని చెప్పాడు. ఇండస్ట్రీ మౌనంగా ఉండటం అంత శ్రేయస్కరం కాదని తెలిపాడు. తాజాగా అతడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) వంటి సినిమాలపై కూడా తన అభిప్రాయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. 


బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ(Nupur Sharma) మహ్మద్ ప్రవక్తపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై గల్ఫ్ దేశాలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ మాటలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప పార్టీకి సంబంధం లేదని బీజేపి తేల్చి చెప్పింది. ఇటువంటి ఘటనలపై బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఎవరు అభిప్రాయాన్ని తెలపకపోవడం అంత మంచిది కాదని నసీరుద్దీన్ షా తెలిపాడు. ‘‘సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారూఖ్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ గురిచి నేను మాట్లాడను. వారు అభిప్రాయాన్ని వెల్లడించకుండా ఉండటం అంత మంచిది కాదు. ఆ హీరోలు తమ మనస్సాక్షికి ఏమని చెబుతారో నాకు తెలియదు. కానీ, వారు మాట్లాడకపోతే చాలా కోల్పోవాల్సి ఉంటుంది’’ అని నసీరుద్దీన్ షా తెలిపాడు. ‘‘షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు ఏమయిందో అందరికీ తెలుసు. కింగ్ ఖాన్ తన పోరాటాన్ని గౌరవప్రదంగా కొనసాగించాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సోనూ సూద్‌పై ప్రభుత్వం దాడులు చేసినప్పుడు ఎవరు కుడా తమ అభిప్రాయాన్ని తెలపలేదు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ వంటి నకిలీ దేశభక్తి సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కశ్మీరీ హిందువుల బాధను ఫిక్ష‌న్ చేసి ఆ చిత్రంలో చూపించారు. ప్రభుత్వం కూడా ప్రమోట్ చేయడంతో ఆ మూవీ భారీ విజయం సాధించింది. ఇటువంటి సినిమాలు భవిష్యత్తులో మరిన్ని వస్తాయి’’ అని నసీరుద్దీన్ షా వెల్లడించాడు. 

Updated Date - 2022-06-10T00:40:16+05:30 IST