Naresh: ‘మా’ మెరుగు పడింది... మరింత ముందుకు తీసుకెళ్తాం

ABN , First Publish Date - 2021-10-16T23:38:25+05:30 IST

‘మా’ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా మాజీ అధ్యక్షుడు నరేశ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు కమిటీ సభ్యులు తమ పని గురించి ఎవరికీ రిపోర్ట్‌ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ‘మా’ బయట ఉండి విష్ణు చేేస పనులకు మద్దతు ఇస్తూనే, ప్రతి నెలా రిపోర్ట్‌ కార్డు అడుగుతామని ప్రకాశ్‌రాజ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌గా నరేశ్‌ మాట్లాడారు. ‘మా’ మసకబారిందనే నాగబాబు వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు.

Naresh: ‘మా’ మెరుగు పడింది... మరింత ముందుకు తీసుకెళ్తాం

‘మా’ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా మాజీ అధ్యక్షుడు నరేశ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు కమిటీ సభ్యులు తమ పని గురించి ఎవరికీ రిపోర్ట్‌ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ‘మా’ బయట ఉండి విష్ణు చేేస పనులకు మద్దతు ఇస్తూనే, ప్రతి నెలా రిపోర్ట్‌ కార్డు అడుగుతామని  ప్రకాశ్‌రాజ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌గా నరేశ్‌ మాట్లాడారు. ‘మా’ మసకబారిందనే నాగబాబు వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. ‘మా’ పదవి భుజకీర్తి కాదు. ఒక బాధ్యత. ఒక సభ్యుడిగా ‘మా’ని అంటిపెట్టుకుంటా. విష్ణు 106 ఓట్ల మెజార్టీతో నేను సాధించిన మెజార్టీ కన్నా ఎక్కువ సంపాదించాడు. సభ్యులకు విష్ణుపైనా ఉన్న నమ్మకం. ఇక్కడ రాజకీయం ఏమీ లేదు. ఈ కమిటీ అవకాశాలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. ఎవరికీ రిపోర్ట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. వెబ్‌సైట్‌లో డేటా అంతా ఉంటుంది. చూసుకోవచ్చు. మహిళలు, యువత కోసం విష్ణు కమిటీ పనిచేస్తుంది. వేగంగా పని జరగాలనే ఉద్దేశంతోనే మొన్న విష్ణుకు బాధ్యతలు అప్పగించి, ఈరోజు ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశాం. పదవుల కోసం నేనెప్పుడూ ఉండను. బాధ్యత కోసం ఉంటాను. నా తుది శ్వాస వరకూ ‘మా’కోసం పనిచేస్తా. విష్ణు కమిటీ మంచి కమిటి. ఈ కమిటీలో అనుభవం కలిగిన వాళ్లు ఉన్నారు. విష్ణు మంచి మేనిఫెస్టోతో వచ్చారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుప్తారు. ఇప్పటివరకూ జరిగింది ఏదో జరిగిపోయింది. భవిష్యత్‌ కోసం పనిచేద్దాం. ‘మా’ మెరుగు పడాలని ఆరేళ్లు పోరాటం చేశా. సభ్యులకు అన్ని రకాల సాయం చేశా. ‘మా’ ఏ ఒక్కరి సొత్తు కాదు. ‘మా’ చిన్నదా? పెద్దదా అనేదీ విషయం కాదు. ఎందుకంటే కోహినూరు వజ్రం చిన్నదే. అయినా అది వజ్రమే. ‘మా’ మెరుగు పడింది... మరింత ముందుకు తీసుకెళ్తాం. ఈ క్షణం నుంచి ‘మంచి మాత్రమే మైకులో మాట్లాడదాం. చెడు చెవిలో చెప్పుకుందాం’’ అని నరేశ్‌ వ్యాఖ్యానించారు’’ అని నరేశ్‌ అన్నారు



Updated Date - 2021-10-16T23:38:25+05:30 IST