నేచురల్ స్టార్ నాని మరోసారి ప్రామిస్ చేశాడు

ABN , First Publish Date - 2022-04-21T02:08:33+05:30 IST

నేచురల్ స్టార్ నాని మరోసారి ప్రామిస్ చేశారు. అంతకుముందు ‘శ్యామ్ సింగరాయ్’ చిత్ర విడుదలకు ముందు.. ఖచ్చితంగా ఈ చిత్రం అలరిస్తుందని ప్రామిస్ చేసిన నాని.. ఇప్పుడు ‘అంటే సుందరానికీ’ చిత్రం విషయంలోనూ మరోసారి

నేచురల్ స్టార్ నాని మరోసారి ప్రామిస్ చేశాడు

నేచురల్ స్టార్ నాని మరోసారి ప్రామిస్ చేశారు. అంతకుముందు ‘శ్యామ్ సింగరాయ్’ చిత్ర విడుదలకు ముందు.. ఖచ్చితంగా ఈ చిత్రం అలరిస్తుందని ప్రామిస్ చేసిన నాని.. ఇప్పుడు ‘అంటే సుందరానికీ’ చిత్రం విషయంలోనూ మరోసారి ప్రామిస్ చేసి సినిమాపై క్రేజ్‌ని పెంచారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ’. ఈ చిత్రం జూన్ 10న విడుదలకానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో మేకర్స్ టీజర్‌ని విడుదల చేశారు. 


ఈ కార్యక్రమంలో హీరో నాని మాట్లాడుతూ.. ‘‘అంటే సుందరానికీ చిత్రం నాకు చాలా స్పెషల్. ఎందుకనేది .. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకే అర్ధమైపోతుంది. ఈ సినిమా కోసం చాలా మంచి టీమ్ పని చేసింది. చాలా రోజుల తర్వాత అంతా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలసి పని చేస్తున్నామనే ప్లజంట్ ఫీలింగ్ కలిగింది. ఇది మీకు తెరపై కనిపిస్తుంది. సినిమా గురించి చెప్పాల్సిన విషయాలు చాలా వున్నాయి.  టీజర్ లాంచ్ కాబట్టి అప్పుడే సినిమా గురించి ఎక్కువ చెప్పను. కానీ దర్శకుడు వివేక్ ఆత్రేయ గురించి మాత్రం ఒక మాట చెప్పాలి. కొన్ని సినిమాలు, కథలు మరో దర్శకుడు తీస్తే ఎలా వుంటుంది? అని ఊహించుకునే అవకాశం వుంటుంది. కానీ వివేక్ తీసిన సినిమా మాత్రం వివేక్ తప్ప ఎవరూ తీయలేరు. ఈ కథని వివేక్ చెప్పినట్లు ఎవరూ చెప్పలేరు. నాలో ఉండే ప్రేక్షకుడు వివేక్ చేసే సినిమాలు రిలీజ్ అయితే ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలని ఫిక్స్ అయిపోయాడు. నజ్రియా తెలుగులో నటిస్తే బాగుంటుందని చాలా కాలంగా చాలా మంది ప్రయత్నించారు. కానీ ఆమె ఎవరి ఫోన్లు తీయలేదు. మా రిక్వెస్ట్‌ని ఒప్పుకున్నందుకు, మా సినిమాలో నటించినందుకు నజ్రియాకి చాలా థ్యాంక్స్. టీజర్ అదిరిపోయింది. దీనికి రెండు రెట్లు ట్రైలర్ ఉంటుంది. ట్రైలర్‌కి పదిరెట్లు సినిమా ఉంటుంది. ప్రామిస్’’ అని అన్నారు.



Updated Date - 2022-04-21T02:08:33+05:30 IST