నాని ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ టీజర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ABN , First Publish Date - 2021-11-11T23:31:23+05:30 IST

న్యాచులర్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ‘శ్యామ్ సింగరాయ్’ చిత్ర టీజర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్

నాని ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ టీజర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

న్యాచులర్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ‘శ్యామ్ సింగరాయ్’ చిత్ర టీజర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన రైజ్ ఆఫ్ శ్యామ్‌ మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే. ‘రైజ్ ఆఫ్ శ్యామ్’తో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టిన మేకర్స్.. చిత్ర టీజర్‌ని నవంబర్ 18వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. 


ఈ పోస్టర్‌లో నాని తన చేతిలో మండుతున్న కర్రను పట్టుకుని ఉన్నారు. నిప్పు కణికలతో పోస్టర్ పవర్ ఫుల్‌గా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే టీజర్ ఎంతో హై ఇంటెన్స్‌తో ఉండబోతోందనేది అర్థమవుతుంది. కాగా, ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించగా.. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 24న ఈ చిత్రం విడుదలకానుంది.

Updated Date - 2021-11-11T23:31:23+05:30 IST