‘శ్యామ్ సింగరాయ్’ ట్రైలర్: ఇట్స్ యాన్ ఓషన్.. ఫుల్ ఆఫ్ సీక్రెట్స్

ABN , First Publish Date - 2021-12-15T02:56:30+05:30 IST

న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోహీరోయిన్లుగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్

‘శ్యామ్ సింగరాయ్’ ట్రైలర్: ఇట్స్ యాన్ ఓషన్.. ఫుల్ ఆఫ్ సీక్రెట్స్

న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోహీరోయిన్లుగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను మంగళవారం వరంగల్‌‌లో నిర్వహించింది. ఈ వేడుకలో మేకర్స్ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ మంచి ఆదరణను చూరగొంటూ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.


ట్రైలర్ విషయానికి వస్తే.. ‘‘లో బడ్జెట్‌లో సినిమాలు తీసే డైరెక్టర్ వాసుగా పరిచయమైన నాని.. కృతిశెట్టితో సినిమాలు తీస్తూ, ఆమెను ప్రేమించే విధానంతో ట్రైలర్‌ని స్టార్ట్ చేశారు. వాసుగా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపించిన నాని, కాసేపటికే మరో షేడ్‌లో కనిపించి.. అందరినీ మెస్మరైజ్ చేశాడు. విలన్ కొట్టే దెబ్బతో ఏదో ఫ్లాష్‌బ్యాక్ ఉన్నట్లుగా.. ‘హ్యుమన్ కాంక్షియస్‌నెస్.. ఇట్స్ యాన్ ఓషన్.. ఫుల్ ఆఫ్ సీక్రెట్స్’ అంటూ మరో నాని.. అదే ‘శ్యామ్ సింగరాయ్’ని పరిచయం చేశారు. శ్యామ్ సింగరాయ్ వీరత్వం, దేవదాసిగా సాయిపల్లవిని చూపించిన తీరు చూస్తుంటే.. ఏదో కొత్త విషయం చెప్పబోతున్నారనేది మాత్రం అర్థమవుతోంది. ‘పిరికివాళ్లే కర్మ సిద్దాంతం మాట్లాడతారు.. ఆత్మాభిమానం కన్నా.. ఏ ఆగమం గొప్పది కాదు. తప్పని తెలిశాక దేవుడినైనా ఎదిరించడంలో తప్పే లేదు..’ అని నాని చెప్పే డైలాగ్.. తర్వాత నటీనటుల ఎమోషన్స్‌తో ట్రైలర్ నడిచిన తీరు చూస్తుంటే.. డిసెంబర్ 24న నాని గట్టిగానే కొట్టబోతున్నాడనిపిస్తోంది. ఓవరాల్‌గా సినిమాపై ఇంట్రస్ట్ క్రియేట్ చేయడమే కాకుండా.. టాలీవుడ్‌కి మంచి కంటెంట్ ఉన్న సినిమా రాబోతోందనేలా ట్రైలర్ తెలియజేస్తోంది.

Updated Date - 2021-12-15T02:56:30+05:30 IST