నెట్‌ఫ్లిక్స్‌లో ‘శ్యామ్ సింగరాయ్’.. ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2022-01-08T23:21:32+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా చాలా చోట్ల థియేటర్లు మూసి వేయడంతో పాటు కొన్ని చోట్ల 50 శాతం సీటింగ్‌తో థియేటర్లు రన్ అవుతున్న దృష్ట్యా.. విడుదలైన చాలా వరకు సినిమాలు రెండు మూడు వారాల గ్యాప్‌తోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ‘పుష్ప’ చిత్రం కూడా తాజాగా..

నెట్‌ఫ్లిక్స్‌లో ‘శ్యామ్ సింగరాయ్’.. ఎప్పుడంటే?

‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం ఓటీటీలో వచ్చేందుకు తేదీ ఫిక్సయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం జనవరి 21 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. కరోనా మహమ్మారి కారణంగా చాలా చోట్ల థియేటర్లు మూసి వేయడంతో పాటు కొన్ని చోట్ల 50 శాతం సీటింగ్‌తో థియేటర్లు రన్ అవుతున్న దృష్ట్యా.. విడుదలైన చాలా వరకు సినిమాలు రెండు మూడు వారాల గ్యాప్‌తోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ‘పుష్ప’ చిత్రం కూడా తాజాగా ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాని ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం కూడా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది.


నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. న్యాచురల్ స్టార్ నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. సక్సెస్ టాక్‌ని సొంతం చేసుకోవడమే కాకుండా.. నాని కెరియర్‌లో విభిన్నమైన చిత్రంగా పేరు తెచ్చుకుంది.

Updated Date - 2022-01-08T23:21:32+05:30 IST