చెన్నైలో సందడి చేసిన Nani - Nazriya..

ABN , First Publish Date - 2022-06-05T18:22:34+05:30 IST

‘అడడే.. సుందరా’ (Adade Sundara) చాలా మంచి సినిమా అని, కడుపుబ్బ నవ్వించే ఈ సినిమాను ప్రేక్షకులతో కలిసి చూస్తే బాగా ఎంజాయ్‌ చేయొచ్చుని హీరో నాని (Nani) అన్నారు.

చెన్నైలో సందడి చేసిన Nani - Nazriya..

‘అడడే.. సుందరా’ (Adade Sundara) చాలా మంచి సినిమా అని, కడుపుబ్బ నవ్వించే ఈ సినిమాను ప్రేక్షకులతో కలిసి చూస్తే బాగా ఎంజాయ్‌ చేయొచ్చుని హీరో నాని (Nani) అన్నారు. నాని, నజ్రియా (Nazriya) జంటగా వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వం వహించిన ‘అడడే.. సుందరా’ చిత్రం ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో భాగంగా, శుక్రవారం రాత్రి హీరో నాని, హీరోయిన్‌ నజ్రియా, నటి రోహిణి, నటుడు అళగర్‌ పెరుమాళ్‌ విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. ‘‘శ్యామ్‌ సింగారాయ్‌’’ (Shyam singharoy) వంటి యాక్షన్‌ చిత్రంలో నటించి ఇపుడు ‘అడడే సుందరా’ (తెలుగులో ‘అంటే.. సుందరానికీ’ (Ante Sundaraniki) వంటి హాస్యంతో కూడిన ప్రేమకథా చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. 


ఈ చిత్ర కథ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చుతుంది. ఆడియన్స్‌కు మంచి థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. జూన్‌ పది తర్వాత స్కూల్స్‌, కాలేజీలు ఓపెన్‌ కానున్నాయి. విద్యార్థులు స్కూల్స్‌కు వెళ్ళే ముందు తమ కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్‌కు వెళ్ళి చూసేలా ఈ చిత్రం ఉంటుంది’ అని వివరించారు. 


నటి నజ్రియా మాట్లాడుతూ.. ‘హీరో నానితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. మంచి ప్రేమకథలను ప్రోత్సహిస్తూ ఆదరిస్తున్న తమిళ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ప్రేమ, హాస్యం కలగలిపి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు’ అని చెప్పారు. అలాగే, నటి రోహిణి, అళగర్‌ పెరుమాళ్‌ తదితరులు నటించారు. మైత్రీ మూవీస్‌ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించి పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చేయనుంది. 

Updated Date - 2022-06-05T18:22:34+05:30 IST